ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘రన్ హైడ్ ఫైట్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
యుద్ధమనేది అనివార్యమైతేనే ఆయుధం గురించి ఆలోచించు అన్న నానుడిని పూర్తిగా అలక్ష్యం చేసి అనవసరంగా ఆయుధాలను సమకూర్చుకోవడంలో మునిగి΄ోయింది నేటి కొంత సమాజం. కొన్ని ప్రదేశాల్లో గల్లీల్లో ఆడుకునే పిల్లల దగ్గర కూడా గ¯Œ ్స ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు.
అడదడఈ గన్ కల్చర్ గురించి వింటూనే ఉన్నాం. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ గన్ కల్చర్ విపరీతంగా ఉంది. ఆ దేశంలో మూతి మీద మీసం కూడా రాని విద్యార్థులు చేతిలో తుపాకీతో ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి సంప్రదాయం ప్రకారం రక్షణ కవచంగా తుపాకీని ఎవరైనా లైసె¯Œ ్స ΄÷ంది తమ దగ్గర ఉంచుకోవచ్చు.
కాని ఇదే గన్ కల్చర్ విపరీత ధోరణిగా మారితే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కైల్ రాంకిన్ ‘రన్ హైడ్ ఫైట్’ సినిమా తీశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అంతలా ఏముంది ఈ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. కథాపరంగా అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలోకి కొందరు విద్యార్థులు చొరబడతారు.
వారందరూ సాయుధులై భారీ మందుగుండు సామాగ్రితో విద్యాలయంలోని తోటి విద్యార్థులను, స్టాఫ్‌ను బందీలుగా చేసుకుని విద్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. విద్యార్థులలో ఒకరైన జో తనను, తనతో పాటు ఆ విద్యాలయంలోని కొందరిని ఎలా రక్షించిందనేదే ఈ ‘రన్ హైడ్ ఫైట్’ సినిమా. ఉత్కంఠభరితం అన్న దానికి పై మాటే ఈ సినిమా స్క్రీన్‌ప్లే. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి ఈ సినిమా కన్నులపండగ. అలాగే కొందరు తల్లిదండ్రులకు ఓ కనువిప్పు ఈ సినిమా. ఇసబెల్ మే ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఈ వీకెండ్ చూసెయ్యండి.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment