మరో హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి | manchu laxmi hollywood movie | Sakshi

మరో హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

May 7 2016 3:53 PM | Updated on Sep 3 2017 11:37 PM

మరో హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

మరో హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి

హాలీవుడ్ సినిమాలతోనే కెరీర్ ప్రారంభి తరువాత టాలీవుడ్లో సెటిల్ అయిన స్టార్ వారసురాలు మంచు లక్ష్మి.

హాలీవుడ్ సినిమాలతోనే కెరీర్ ప్రారంభి తరువాత టాలీవుడ్లో సెటిల్ అయిన స్టార్ వారసురాలు మంచు లక్ష్మి. మోహన్ బాబు నట వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే భారత్కు తిరిగి వచ్చాక హాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించింది.

గతంలో లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టీవీ సీరియల్స్తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మంచు లక్ష్మి, తాజాగా బాస్మతి బ్లూస్ చిత్రంలో నటించింది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్తో పాటు డబ్బింగ్ను కూడా పూర్తిచేసింది లక్ష్మి. ఆస్కార్ విజేత బ్రీ లారెన్స్, డోనాల్డ్ సతర్లాండ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం భారత్లోనే షూటింగ్ జరుపుకోవటం విశేషం.

ఈ సినిమా ఓ సైంటిస్ట్ కథ. తాను సృష్టించిన ఓ వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చిన సైంటిస్ట్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్పెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాస్మతి బ్లూస్ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement