మంచు మనోజ్
హీరోలంటే కేవలం నటనకే పరిమితం కాదని మంచు మనోజ్ ప్రతీసారి నిరూపిస్తున్నారు. మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటు చేసుకున్నారు మనోజ్. న టుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, స్టంట్ మాస్టర్‌గా.. ఇలా ప్రతీ సినిమాకు తనలో ఏదో ఒక కొత్త కోణాన్ని అభిమానులకు చూపిస్తున్నారు మనోజ్. ‘నేను మీకు తెలుసా’ సినిమాలో స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకోవడంతో పాటు ‘కన్ను తెరిస్తే జననమేలే’ పాటను కూడా రాసిన విషయం గుర్తుండే ఉంటుంది.
‘బిందాస్, కరెంట్ తీగ, వేదం, మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో తన పాత్రకు తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకున్నారు. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయాను...’ అని సరదాగా గొంతు కూడా సవరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మ్యూజిక్ డైరెక్టర్‌గా మరో కొత్త అవతారం ఎత్తారు మనోజ్. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్‌కి హలో చెబుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ బ్రీ లార్సన్ లీడ్ యాక్టర్‌గా నటించిన హాలీవుడ్ మూవీ ‘బాస్మతీ బ్లూస్’కి సంగీత దర్శకుడిగా మారారు మనోజ్. తన స్నేహితుడు, సంగీత దర్శకుడైన అచ్చుతో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో లక్ష్మీ మంచు ఓ కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment