Gal Gadot Shares a First Look at Her New Netflix Movie Heart of Stone - Sakshi
Sakshi News home page

Gal Gadot: వండర్‌ వుమెన్‌ కొత్త చిత్రం.. తెర వెనుక చిత్రాలు షేర్‌

Published Tue, Mar 8 2022 5:33 PM | Last Updated on Tue, Mar 8 2022 8:18 PM

Alia Bhatt Entry In Hollywood Movie With Gal Gadot - Sakshi

హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ఫాస్ట్‌ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్‌లో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా నటించిన హాలీవుడ్ బ్యూటీ గాల్‌ గాడోట్‌ సూపర్‌ హీరో 'వండర్‌ వుమెన్‌' సినిమాతో మోస్ట్ పాపులర్‌ అయింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ భామ 2017లో వచ్చిన 'వండర్‌ వుమెన్‌'తో రాత్రికి రాత్రి స్టార్‌గా మారింది. అపారమైన విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'వండర్‌ వుమెన్‌ 1984' చిత్రం విడుదలై ఆడియెన్స్‌తో నిజంగా 'వండర్‌' వుమెన్‌ అని అనిపించుకుంది. ఇటీవల విడుదలైన 'రెడ్ నోటీస్‌', 'డెత్‌ ఆన్‌ ది నీల్‌' సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

చదవండి: మళ్లీ ఆ పాత్ర చేయాలని ఉందన్న పాపులర్‌ హీరోయిన్‌.. అదేంటంటే ?

తాజాగా ఈ వండర్‌ వుమెన్‌ నటిస్తున్న చిత్రం హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌. ఈ సినిమాలో జామీ డోర్నన్‌తోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌ కూడా నటిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బ్రిటీష్ డైరెక్టర్‌ టామ్‌ హార్పర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది గాల్‌ గాడోట్. ఈ వీడియోలో 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌' తెరవెనుక చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేస్తూ 'రాచెల్‌ స్టోన్‌. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌' అంటూ రాసుకొచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement