
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో నేరుగా 'సార్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా నటిస్తున్నాడు.
Dhanush The Gray Man Video Viral: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో నేరుగా 'సార్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్ మూవీ 'ది గ్రే మ్యాన్'లో కూడా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో ధనుష్ కొంచెంసేపు మాత్రమే కనిపించాడు. దీంతో ధనుష్ అభిమానులు నిరాశపడ్డారు. అయితే ధనుష్ అభిమానుల కోసం తాజాగా ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో ధనుష్ చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో చూసిన ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 22న విడుదల కానుంది. మార్క్ గ్రీన్ రాసిన పుస్తకం ఆధారంగా రూసో బ్రదర్స్ (జో రూసో-ఆంటోనీ రూసో) ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాకు తగిన విధంగా జో రూసో, క్రిస్టోఫర్ మార్కస్, స్టీఫెన్ మెక్‌ఫీల్ స్క్రిప్ట్ రాశారు. అలాగే త్వరలో ఈ సినిమాను ధనుష్‌తో సహా వీక్షించేందుకు డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ ఇండియా రానున్నట్లు ఇటీవల ప్రకటించారు.
Avik san from the #thegrayman @Russo_Brothers https://t.co/YDw98J0O8J
— Dhanush (@dhanushkraja) July 12, 2022