బ్యాట్‌మేన్ విన్యాసాలను ‘బ్యాట్‌మేన్’లో అద్భుతంగా చూపించారు దర్శకుడు మాట్ రీవ్స్. ఈ చిత్రం 2022లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి విడుదల కోసం బ్యాట్‌మేన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జెఫ్రీ రైట్, రాబర్ట్ ప్యాటిన్‌సన్, ఆండీ సెర్కిస్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 అక్టోబరులో రిలీజ్ చేయాలనుకున్నారు.
ఇంకో ఏడాది ఆగాలా? అనుకున్న అభిమానులు మరింత నిరాశపడే చేదు వార్తను ఇచ్చింది ‘బ్యాట్‌మేన్ 2’ యూనిట్. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడంలేదు. 2026 అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇలా ‘బ్యాట్‌మేన్ 2’ చిత్రం ఏకంగా ఏడాది ఆలస్యంగా థియేటర్స్‌కు రానుంది. కాగా కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మాట్ రీవ్స్ కొత్తగా కొన్ని మార్పులు అనుకున్నారని, వీటిని సెట్స్‌లో చిత్రీకరించేందుకు టైమ్ పడుతుందని, అందుకే ‘బ్యాట్‌మేన్ 2’ చిత్రం విడుదల వాయిదా పడిందని హాలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment