ఏజెంట్‌ నూర్‌ | Radhika Apte to essay role of a World War II heroine in Liberte | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ నూర్‌

Jun 24 2019 6:15 AM | Updated on Jun 24 2019 6:15 AM

Radhika Apte to essay role of a World War II heroine in Liberte - Sakshi

రాధికాఆప్టే

ఫ్రాన్స్‌లో గూఢచర్యం చేశారు రాధికాఆప్టే. మరి.. ఆమె సీక్రెట్‌ ఆపరేషన్‌ ఎలా సాగిందో వెండితెరపై చూడాల్సిందే. ఆస్కార్‌ నామినేటెడ్‌ డైరెక్టర్‌ లిడియా డీన్‌ పిల్చర్‌ దర్శకత్వంలో ‘లిబర్టే: ఏ కాల్‌ టు స్పై’ అనే హాలీవుడ్‌ మూవీ తెరకెక్కింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సారా మేఘన్‌ థామస్, స్టానా కాటిక్, రాధికా ఆప్టే, లైనస్‌ రోచె, రోసిఫ్‌ సదర్లాండ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ఇండియన్‌ ముస్లిమ్‌ స్పై ఏజెంట్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ పాత్రలో రాధికా ఆప్టే నటించారు. ఇటీవల యూకేలో జరిగిన ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ఈ సినిమా టీమ్‌ కలుసుకున్నారు. ఈ సమయంలో ఈ సినిమాలోని తన లుక్‌ను రాధికా ఆప్టే షేర్‌ చేశారు. ఇక.. బాలీవుడ్‌లో ‘రాత్‌ అఖేలి హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ హీరో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement