హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా రాధికా ఆప్టే | Radhika apte act in hollywood movie | Sakshi

హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా రాధికా ఆప్టే

Published Sun, Mar 15 2015 9:15 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా రాధికా ఆప్టే - Sakshi

హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా రాధికా ఆప్టే

సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో తారల నగ్నంగా నటించడం పరిపాటే.

సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో తారల నగ్నంగా నటించడం పరిపాటే. అయితే, తాను ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటిస్తున్నట్టు దక్షిణాది నటి రాధికా ఆప్టే తెలపడం విశేషం. ధోని చిత్రం ద్వారా ప్రకాష్‌రాజ్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచమైన ఈ భామ ఆ తర్వాత ఆలిన్ ఆల్ అళగు రాజ, వెట్రి సెల్వన్ తదితర చిత్రాల్లో నటించింది.
 
ఆ మధ్య బాలకృష్ణ సరసన తెలుగులో లెజెండ్‌చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అదే విధంగా మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళి పలు భాషల్లో నటిస్తున్న రాధికా ఆప్టే తాజాగా ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారట. దీని గురించి ఆమె తెలుపుతూ, తాను నటిస్తున్న హాలీవుడ్ చిత్రం గురించి ప్రస్తుతానికి వివరాలు సస్పెన్స్ అన్నారు.
 
అయితే, ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు నగ్నంగా నటించానని చెప్పారు. అయితే, ఈ చిత్రం ఇండియాలో విడుదల అయితే, ఆ సన్నివేశాలు తొలగించేలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. కాగా, ఈ బ్యూటీ ఇటీవల బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే, ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని, అవన్నీ మార్ఫింగ్ అని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement