Gladiator 2 Trailer: నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. అది మరచిపోలేదు | Hollywood Movie Gladiator 2 Release Date Out | Sakshi
Sakshi News home page

Gladiator 2 Trailer: నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. అది మరచిపోలేదు

Published Sat, Oct 19 2024 10:59 AM | Last Updated on Sat, Oct 19 2024 11:24 AM

Hollywood Movie Gladiator 2 Release Date Out

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాలీవుడ్‌ చిత్రం ‘గ్లాడియేటర్‌’. రిడ్లీ స్కాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000లో వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘గ్లాడియేటర్‌ 2’కి కూడా రిడ్లీ స్కాట్‌యే దర్శకత్వం వహించారు. పాల్‌ మెస్కల్, డెంజెల్‌ వాషింగ్‌టన్, పెడ్రో పాస్కల్, కొన్నే నిల్సన్, జోసెఫ్‌ క్విన్‌ వంటివారు నటించారు. 

ఈ చిత్రం నవంబరు 15న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 4డీఎక్స్‌ మరియు ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ కానుంది. ఇక ‘నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. నేను అది మరచిపోలేదు.. ఒక బానిస రాజుపై ప్రతీకారం తీర్చుకున్న క్షణం’ వంటి డైలాగ్స్‌ ‘గ్లాడియేటర్‌ 2’ ట్రైలర్‌లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement