‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Venom: The Last Dance Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Wed, Jun 5 2024 11:06 AM | Last Updated on Thu, Jun 6 2024 11:42 AM

Venom: The Last Dance Movie Release Date Out

హాలీవుడ్‌ హిట్‌ ఫ్రాంచైజీ ‘వెనమ్‌’ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’. తొలి, మలి భాగాలు ‘వెనమ్‌ (2018)’, ‘వెనమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌ (2021)లకు ప్రేక్షకుల నుంచి, బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’పై అంచనాలు ఉన్నాయి. ‘వెనమ్, వెనమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌’ (2021) లలో హీరోగా నటించిన టామ్‌ హార్డీయే ‘వెనమ్‌: ది లాస్ట్‌డ్యాన్స్‌’ చిత్రంలోనూ నటించారు. 

‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’కు కెల్లీ మార్సెల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎడ్డీ బ్రాక్‌ పాత్రలో టామ్‌ హార్డీ కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇక ‘వెనమ్‌’ ఫ్రాంచైజీలో ‘వెనమ్‌: ది లాస్ట్‌ డ్యాన్స్‌’ చివరి చిత్రం అవుతుందనే టాక్‌ హాలీవుడ్‌లో వినిపిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement