హాలీవుడ్‌ హారర్‌ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్‌ డేట్‌ ఇదే | Insidious: The Red Door Movie Release Date Out | Sakshi
Sakshi News home page

భయపెట్టడానికి వచ్చేస్తున్న ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’.. రిలీజ్‌ ఎప్పుడంటే..

Published Sun, Jul 2 2023 1:09 PM | Last Updated on Sun, Jul 2 2023 1:09 PM

Insidious: The Red Door Movie Release Date Out - Sakshi

హాలీవుడ్‌ హారర్‌ మూవీ ఇన్సిడియస్ ప్రాంచైజీ 5వ భాగంగా ఇన్సిడియస్: ది రెడ్ డోర్ రాబోతుంది. పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సోనీ పిక్చర్స్‌ ద్వారా జులై 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇన్సిడియస్‌(2010), ఇన్సిడియస్‌ చాప్టర్‌ 2(2013)కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇన్సిడియస్‌ చాప్టర్‌ 2 ముగింపు తర్వాత అంటే ఆ సంఘటనలు జరిగిన పదేళ్ల తర్వాత ఈ చిత్రం కథ ప్రారంభం కానుంది. 

ది రెడ్ డోర్ స్టోరీ ఏంటంటే..
జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ యూనివర్శిటీలో దింపడానికి వెళ్తాడు. ఆ యూనివర్శీటీ డాల్టన్‌కు ఓ పీడకలలా మారుతుంది. అతని చేత గతంలో అణచివేతకు గురైన రాక్షసులు అకస్మాత్తుగా వారిద్దరినీ వెంటాడేందుకు తిరిగి వస్తాయి. రాక్షసులను అంతం చేయడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ మరోసారి ఏమిచేశారు అనేదే ఈ మూవీ కథ. ఈ చిత్రంలో డాల్టన్ లాంబెర్ట్ గా టై సింప్కిన్స్, జోష్ లాంబెర్ట్ గా పాట్రిక్ విల్సన్, ఫోస్టర్ లాంబెర్ట్ గా ఆండ్రూ ఆస్టర్  నటించారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ హారర్‌ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు భయపెడుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement