బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంథాలజీ ఉమెన్స్ స్టోరీస్‌తో ఈ భామ హాలీవుడ్ డెబ్యూ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రకటించింది. మొత్తం ఆరు భాగాలుగా ఈ అంథాలజీ కథను తెరకెక్కించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు మహిళా దర్శకులు ఈ కథలను రూపొందించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీనటులతో ఈ సినిమా చేయనున్నారు.
జాక్వెలిన్ కథకు సంబంధించి ఈ సినిమాలో ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ మోడల్‌తో నటించింది. గతేడాది అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. చాలా వరకు ముంబైలోనే షూటింగ్‌ను నిర్వహించారు. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్న జాక్వెలిన్ జాన్ అబ్రహం,అక్షయ్ కుమార్‌ల యాక్షన్ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తిచేసింది. లాక్‌డౌన్ కారణంగా సల్మాన్‌తో చేస్తున్న కిక్-2 సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
చదవండి : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె
కేంద్రంపై బాలీవుడ్ నటి మీరా చోప్రా విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment