Doctor Strange Multiverse of Madness: మార్వెల్ యూనివర్స్ తెరెక్కించే సూపర్ హీరో సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా వచ్చింది డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్. ఈవిల్ డెడ్ డైరెక్టర్ సామ్ రైమీ రూ.1500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ గత నెల 6న విడుదలై వేల కోట్లు రాబట్టింది.
బెనడిక్ట్ కుంబర్ బ్యాచ్, ఎలిజబెత్ ఓల్సన్, జోచిటి గోమెజ్, వాండా మ్యాక్సిమాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్‌తో అదరగొట్టింది. డాక్టర్ స్ట్రేంజ్ చూసినవారికి ఈ సీక్వెల్ బాగా అర్థమవుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. హాట్‌స్టార్ జూన్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. మొత్తానికి మాస్టర్ పీస్‌ను తీసుకొస్తున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Marvel Studios’ Doctor Strange in the Multiverse of Madness streams from June 22 in Hindi, Tamil, Telugu, Malayalam, Kannada and English. pic.twitter.com/0655EjTUgI
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 2, 2022
చదవండి:Major Review: మేజర్ మూవీ రివ్యూ
బిగ్‌బాస్ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ !..
Comments
Please login to add a commentAdd a comment