కొత్త టీజర్‌.. అజాతశత్రు సాహసయాత్ర | The Extraordinary Journey of the Fakir teaser out | Sakshi
Sakshi News home page

ధనుష్‌ హాలీవుడ్‌ టీజర్‌ వచ్చేసింది

Feb 10 2018 10:35 AM | Updated on Apr 3 2019 9:01 PM

The Extraordinary Journey of the Fakir teaser out - Sakshi

ద ఎక్స్టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ లో ఓ దృశ్యం

సాక్షి, సినిమా : సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం టీజర్‌ వచ్చేసింది. ‘ద ఎక్స్టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్’ చిత్రంలో ధనుష్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. చిత్ర అనుభవాలను దర్శకుడు వివరిస్తుండగా.. ఓ బైట్‌ను విడుదల చేశారు. దీనిని ధనుష్‌ తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. 
 
అజాతశత్రు లావాష్‌ పటేల్‌ పాత్రలో ధనుష్‌ ఇందులో కనిపించబోతున్నాడు. ముంబైకి చెందిన ఈ కుర్రాడికి లోకజ్ఞానం తెలీదు. ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచి ఉండలేని పటేల్‌ కొన్ని పరిస్థితుల రిత్యా ప్రపంచ యాత్రకు బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కునే పరిస్థితులు.. సాహసాలు, మధ్యలో ప్రేమ కథ ఇలా సాగుతోంది సినిమా. ఎమోషనల్‌ అండ్‌ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు దర్శకుడు కెన్‌ స్కాట్‌ వివరించాడు. ధనుష్‌ లాంటి నటుడితో పని చేయటం నిజంగా మంచి అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు.

ధ‌నుష్ సరసన బెరనైస్‌ బెజో, అలెగ్జాండ్రా దడారియోలతో నటించారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా కెనడియన్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ కమ్‌ డైరెక‍్టర్‌ కెన్‌ స్కాట్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, లిబియాలో షూటింగ్ జరుపుకుంది. వివిధ దేశాల‌కు చెందిన టెక్నీషియ‌న్స్ ప‌నిచేసిన‌ట్టు ద‌ర్శ‌కులు తెలిపారు. మే 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంగ్లీష్‌తోపాటు ఫ్రెంచ్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

ధనుష్‌ ఎవరో తెలీదు... డైరెక్టర్‌
ఈ సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ కెన్‌ స్కాట్‌ ధనుష్‌​ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధనుష్‌ అంటే తనకు ముందు ఎవరో తెలీదని ఆయన చెప్పారు. ‘ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూశాను. అప్పుడే ధనుష్ ని చూశానని.. ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించింది. ధనుష్‌ ఓ మంచి నటుడే కాదు. మేధావి కూడా.. ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై ఓ అభిప్రాయానికి వస్తాడు. సినిమాకు అతనే బలమని నా ఉద్దేశం. ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్‌లో ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయి అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement