బాక్సాఫీస్ షేక్!
హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్ 4: ఏజ్ ఆఫ్ ఎక్స్‌టింక్షన్’ గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గత ఏడాది విడుదలైన వాటిల్లో అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. 100 హయ్యస్ట్ గ్రాసింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్‌లో టాప్ స్థానం దక్కించుకుంది. మొత్తం 845.3 మిలియన్ డాలర్లను వసూలు చేసి సంచలనం రేపింది.
84 దేశాల్లో రిలీజ్ అయిన ఏంజలినా జోలీ ‘మేలెఫిసెంట్’ 516.8 మిలియన్ డార్లతో రెండో స్థానంలో నిలిచింది. ‘ఎక్స్‌మ్యాన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ 514.2 మిలియన్ డాలర్లు వసూలు చేసి తరువాతి స్థానం దక్కించుకుంది. డిస్నీ ‘ఫ్రోజన్, అమేజింగ్ స్పైడర్‌మ్యాన్ 2’ సినిమాలు నాలుగు, ఐదు ప్లేసులకు పరిమితమయ్యాయి.