Furiosa A Mad Max Saga: రిలీజ్‌కు రెడీ అయిన హాలీవుడ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌  | Furiosa A Mad Max Saga Release Date Out | Sakshi
Sakshi News home page

Furiosa A Mad Max Saga: రిలీజ్‌కు రెడీ అయిన హాలీవుడ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ 

Published Thu, May 16 2024 5:16 PM | Last Updated on Thu, May 16 2024 5:16 PM

Furiosa A Mad Max Saga Release Date Out

హాలీవుడ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం ప్యూరియోసా ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ఈ నెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది 2015లో వచ్చిన మ్యాడ్‌ మ్యాక్స్‌ ప్యూరి రోడ్‌ చిత్ర ప్రాంచైజీలో తాజా చిత్రం. గత చిత్రాల దర్శకుడు జార్జ్‌ మిల్లర్‌నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్‌ కథతో రూపొందించిన చిత్రం ప్యూరియోసా ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా. 

ఇందులో అన్యటైలర్‌ జాయ్‌ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థతో కలిసి మిల్లర్‌ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్‌ నామినేటెడ్‌ నిర్మాత డౌగ్‌ మిథ్చల్‌ ఆ్రస్టేలియా బేస్‌డ్‌ కెన్నడీ మిల్లర్‌ మిచ్చల్‌ పతాకంపై నిర్మించారు. 

కాగా ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటుడు క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ మీడియాతో పంచుకున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. నిజానికి ఇంత మంచి పాత్రలో తాను నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో తన పాత్ర ఆది నుంచి అంతం వరకు ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పాత్రను తాను భవిష్యత్తులో నటిస్తానో లేదో అని కూడా చెప్పలేను అన్నారు. కాగా ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్‌ సంస్థ ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement