స్టార్‌వార్స్‌ జస్ట్‌ ఓకే | 'Star Wars: The Last Jedi' Plummets 69% To Top $100M Losers Club | Sakshi
Sakshi News home page

స్టార్‌వార్స్‌ జస్ట్‌ ఓకే

Published Mon, Dec 25 2017 12:44 AM | Last Updated on Mon, Dec 25 2017 12:44 AM

'Star Wars: The Last Jedi' Plummets 69% To Top $100M Losers Club - Sakshi

స్టార్‌ వార్స్‌ పోస్టర్‌

హాలీవుడ్‌లో ‘స్టార్‌వార్స్‌’కు ఉన్న క్రేజ్‌ మరే ఇతర సిరీస్‌కు లేదన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ మూవీస్‌లో బాక్సాఫీస్‌ వద్ద ‘స్టార్‌ వార్స్‌’ సినిమాలు కొన్నేళ్లుగా సృష్టిస్తూ వచ్చిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ ఏడాది ‘స్టార్‌ వార్స్‌’ సీక్వెల్‌ ట్రయాలజీలో రెండో సినిమా అయిన ‘స్టార్‌ వార్స్‌ : ది లాస్ట్‌ జేడి’ వచ్చింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 15న విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా బాక్సాఫీస్‌ వద్ద నిలబడడం లేదు.

నిజానికి ఈ ఏడాది బిగ్గెస్ట్‌ గ్రాసర్స్‌లో టాప్‌లో ఈ సినిమా నిలుస్తుందనుకున్నా అంత సీన్‌ అయితే కనపడడంలేదు. ఇక క్రిస్మస్‌ వారానికి కూడా లెక్కలేనన్ని సినిమాలు వచ్చేయడంతో ‘స్టార్‌వార్స్‌’ కథ ఈసారికి ముగిసినట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ సినిమా 650 మిలియన్‌ డాలర్లు (4,161 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇది హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి నంబరే కానీ, ‘స్టార్‌వార్స్‌’ రేంజ్‌ కాదన్నది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో వచ్చినా టాప్‌లో నిలబడుతుందనుకున్న సినిమా మొత్తానికి అంతంత మాత్రమే అనిపించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement