భలే చాన్సులే... | wonder woman sequel movie in soundarya sharma | Sakshi

భలే చాన్సులే...

Aug 31 2018 5:28 AM | Updated on Aug 31 2018 5:28 AM

wonder woman sequel movie in soundarya sharma - Sakshi

సౌందర్యా శర్మ, గాల్‌ గోడాట్‌

హాలీవుడ్‌లో సూపర్‌ హీరో సినిమాలకు ఫుల్‌ క్రేజ్‌. సూపర్‌ మేన్‌లే కాదు ఉమెన్‌ సినిమాలను కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు ఆడియన్స్‌. గాల్‌ గోడాట్‌ హీరోయిన్‌గా గతేడాది రిలీజ్‌ అయిన సూపర్‌ ఉమెన్‌ ఫిల్మ్‌ ‘వండర్‌ ఉమెన్‌’ కూడా బాక్సాఫీస్‌ని భరతనాట్యం ఆడించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ ‘వండర్‌ ఉమెన్‌ 1984’ ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు ప్యాటీæ జెనిక్స్‌. ఈ సూపర్‌ ఉమెన్‌ సినిమాలో వండర్‌ఫుల్‌ చాన్స్‌ కొట్టేశారు బాలీవుడ్‌ హీరోయిన్‌ సౌందర్యా శర్మ.

‘మీరుతియా గ్యాంగ్‌స్టర్స్, రాంచీ డైరీస్‌’ వంటి సినిమాల్లో కనిపించారు సౌందర్య. ప్రస్తుతం బాలీవుడ్‌లో బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి ఏకంగా హాలీవుడ్‌ చాన్స్‌ అంటే మాటలు కాదు. ఐశ్వర్యా రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌ లాంటి యాక్టర్స్‌ హాలీవుడ్‌కి హాయ్‌ హాయ్‌ చెబుతుంటే ఈ లిస్ట్‌లోకి సౌందర్య కూడా చేరారు. ‘‘కల నిజమైనట్లుగా ఉంది. ఇలాంటి పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను’’ అన్నారు సౌందర్య. ఈ సీక్వెల్‌ వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement