
రాధికా ఆప్టేలో రెండు కోణాలున్నాయి. ఎంత సంప్రదాయబద్ధంగా కనిపించగలుగుతారో అంత మోడ్రన్‌గానూ కనిపించగలరు. అందుకే చీర కట్టుకుని నిండుగా కనిపించే పాత్రలనూ చేస్తారు. చిట్టిపొట్టి దుస్తులు డిమాండ్ చేసే పాత్రలూ చేస్తారు. నటిగా భేష్ అనిపించుకున్న ఈ బ్యూటీ దర్శకురాలిగా మారి, ‘ది స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఈ సినిమా గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ – ‘‘నిజానికి నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. అయితే రాయడం అంటే ఇష్టం.
అది కూడా ఎందుకంటే... ఒక నటిగా నేను వేరేవారి కథల్లో నటిస్తాను. నా ఊహల్లో కొన్ని చాలెంజింగ్ కథలు ఉంటాయి. ఆ కథలు రాయాలనుకున్నాను. ‘ది స్లీప్ వాకర్స్’ కథ మొత్తం రెడీ అయ్యాక అందులో నటించాలని నాకు అనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించింది. అంతే... పది రోజుల్లో ప్రిపేర్ అయి, షూటింగ్ మొదలుపెట్టాం. దర్శకురాలిగా ఈ ప్రయాణం నాకు మంచి అనుభూతినిచ్చింది’’ అన్నారు. సహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ‘పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితమైంది. ఇక నటిగా రాధికా ఆప్టే ప్రస్తుతం ‘మిసెస్ అండర్‌కవర్’ అనే సినిమా చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment