
కొందరు ఉచిత సలహాలు బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టేలాంటి వాళ్లను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన నటీమణుల్లో ఈమె ఒకరు. తమిళంలో ధోని, కబాలి తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది.
ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న రాధిక ఆప్టే ఎక్కువగా వెబ్ సిరీసుల్లోనే నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో మాట్లాడుతూ ‘ప్రేమికులు గానీ, దంపతులు కానీ తమ మధ్య తగవులు వస్తే ఇతరుల మాటలు వినకండి. ఎందుకంటే వాళ్లు మీ మధ్యకు వస్తే మీ మధ్య గొడవలు మరింత జటిలం అవుతాయి. ఇద్దరి మధ్య అగాథం పెరిగే ప్రమాదం ఉంది. మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది మనకు మాత్రమే తెలుసు’ అని ఉచిత సలహాలు ఇచ్చింది.
ఇంతకీ ఈ అమ్మడు చెప్పే సూక్తులు స్వానుభవమా? లేక ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసిన అనుభవమా? ఎందుకంటే ఎదుటివాళ్లకు చెప్పడానికే నీతులు అన్న సామెత ఉండనే ఉంది కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment