మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న.. | radika apte fight on women issues | Sakshi
Sakshi News home page

మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న..

Nov 27 2016 2:33 AM | Updated on Oct 2 2018 6:46 PM

మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న.. - Sakshi

మహిళల కోసం పోరాటం చేస్తానంటున్న..

మహిళా సమస్యల కోసం పోరాడడానికి సిద్ధమవుతోంది నటి రాధికాఆప్టే. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో రాధికాఆప్టే ఒకరని చెప్పవచ్చు.

మహిళా సమస్యల కోసం పోరాడడానికి సిద్ధమవుతోంది నటి రాధికాఆప్టే. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో రాధికాఆప్టే ఒకరని చెప్పవచ్చు. నటుడు ప్రకాశ్‌రాజ్ నటించి, నిర్మించిన ధోని చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి రాధికాఆప్టే.తొలి చిత్రంలోనే ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తెగా నటించి గుర్తింపుపొందారు. అరుుతే ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయారు.అలాంటి రాధికాఆప్టేకు ఏకంగా సూపర్‌స్టార్‌తో జతకట్టే అవకాశం వరించడం ఎవరూ ఊహించనిదే. అలా కబాలి చిత్రంతో బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఉత్తరాది భామ బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న సన్నివేశాల్లో నటించడం, అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం వంటి అంశాలతో సంచలన నటిగా మారారు.

అరుుతే కబాలి చిత్రం తరువాత నటిగా తన స్థారుు మారిపోతుందని ఆశించిన రాధికాఆప్టేకు అలా జరగలేదు. కారణం ఆమె అశ్లీల చిత్రాల ప్రదర్శన కూడా ఒక కారణం కావొచ్చు. హిందీలో ఒకటి, రెండు చిత్రాలు చేస్తున్న రాధికాఆప్టేకు తాజాగా ఒక అవకాశం వచ్చింది. దర్శకుడు మిష్కిన్ శిష్యుడు ఆదిత్య దృష్టిలో పడ్డారు. ఆయన సవరకట్టి అనే చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సవరకట్టి చిత్రంలో సెలూన్ షాపుల నిర్వాహకులు సమస్యలను తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ఈ సారి మహిళల సమస్యలను తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.ఇందులో రాధికాఆప్తే మహిళల కోసం పోరాడే విప్లవ భావాలు కలిగిన యువతిగా నటించనున్నారట.అలాంటి పాత్రల్లో రాధికాఆప్టేను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement