
రాధికా ఆప్టే
ఒక సినిమాలో భాగమయ్యే విధానంలో నటీనటులకు విభిన్నమైన అనుభవాలు కలుగుతుంటాయి. అన్నీ మంచి అనుభవాలే అయ్యుండాల్సిన అవసరం లేదు. కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇలా తనకు ఎదురైన ఓ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకున్నారు రాధికా ఆప్టే. ‘‘మనం కథ విన్న అన్ని ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పాలనేం లేదు. ఎగై్జటింగ్ రోల్ అనిపిస్తేనే నేను గ్రీన్‌సిగ్నల్ ఇస్తాను. ఒక ప్రొడ్యూసర్స్ నాకు ఓ కథ చెప్పారు. అందులో కథానాయిక పాత్ర నాకోసమే రాశాం అన్నారు.
ఆ పాత్ర నాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఓకే అన్నాను. కానీ ఓ స్మాల్ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత వాళ్లను అప్రోచ్ అయితే ‘నువ్వు చాలా లావుగా కనిపిస్తున్నావ్.. మా సినిమాలో తీసుకోం’ అనేశారు. షాకయ్యాను. షూటింగ్‌కు రెండు నెలలు టైమ్ ఉంది. నేను తగ్గుతాను అన్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కొత్తగా అనిపించింది’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ (ది వెడ్డింగ్ గెస్ట్, రెండో ప్రపంచయుద్ధం ఆధారంగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్)లతో పాటు వరుస బాలీవుడ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవకాశాలతో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు రాధికా ఆప్టే.
Comments
Please login to add a commentAdd a comment