'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు' | They asked me to hide my marital status | Sakshi
Sakshi News home page

'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'

Published Wed, Jan 20 2016 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'

'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'

వయసు, పెళ్లి అనే విషయాలు హీరోలకు పెద్దగా అడ్డు రాకపోయినా హీరోయిన్ల కెరీర్కు ఈ అంశాలు చాలా కీలకం. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న భామలను హీరోయిన్ క్యారెక్టర్స్కు తీసుకోవటం చాలా అరుదు. అయితే అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ బ్యూటీ తన పెళ్లి తరువాత ఇండస్ట్రీ వర్గాల నుంచి తనకు వచ్చిన సలహాలను మీడియాతో పంచుకుంది.

సౌత్తో పాటు నార్త్లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రాధిక ఆప్టే. ఎక్కువగా హోమ్ లీ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ భామ బద్లాపూర్ సినిమాతో పాటు, అహల్య షార్ట్ ఫిలింతో బోల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తరువాత తను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులను వివరించింది.

తను పెళ్లి చేసుకున్న విషయం దర్శక నిర్మాతలకు తెలిసి, వారు ఆ విషయాన్ని దాచిపెట్టామన్నారని తెలిపింది. అయితే తన భర్త లండన్లో ఉంటున్న కారణంగా తాను కొద్ది రోజులు షూటింగ్లో ఉంటే, మరికొద్ది రోజులు భర్త దగ్గరకు వెళ్లాల్సి ఉంటుదని,  కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టడం కష్టం అని వారికి తేల్చి చెప్పేసిందట. అంతేకాదు పెళ్లి తరువాత కూడా తను గతంలో చేసినట్టుగా అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ అంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement