marital status
-
పేరెంట్స్ విషయంలోనూ పూజా ఖేద్కర్ అబద్ధం!
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ విషయంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తన తల్లిదండ్రులు విడిపోయారని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అది నిజం కాదని తేల్చారు. పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి తెలియజేయాలని పూణే పోలీసులను కేంద్రం ఆదేశించింది. యూపీఎస్సీ పరీక్షలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్‌ను పూజా వినియోగించుకుంది. ఇందుకోసం ఆమె తన తల్లిదండ్రులు విడిపోయారనే కారణాన్ని జత చేసింది. అయితే ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై కేంద్రం నివేదికను కోరింది.ఈ నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితికి సంబంధించి పూణె పోలీసులు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పూజా తల్లిదండ్రులైన దిలీప్, మనోరమా ఖేడ్కర్లు చట్టబద్ధంగా విడిపోయారని, అయినప్పటికీ వారిద్దరూ కలిసే ఉంటున్నారని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తాను తండ్రికి దూరంగా తన తల్లితో ఉంటున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని ఆమె పేర్కొన్నారు. అయితే దిలీప్.. మనోరమ ఖేడ్కర్ 2009లో పూణేలోని ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2010, జూన్ 25న వారు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ బన్నర్ ప్రాంతంలోని నివాసంలో కలిసే ఉంటున్నారు. కుటుంబ ఫంక్షన్లకు కలిసే హాజరవుతున్నారని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ సమర్పించిన అఫిడవిట్లో మనోరమను తన భార్యగా పేర్కొనడం కొసమెరుపు. -
24 వారాల్లోపే అబార్షన్‌కు అనుమతి: సుప్రీంకోర్టు
-
అబార్షన్.. ఆమె ఇష్టం.. గర్భస్రావానికి అవివాహితులూ అర్హులే
సాక్షి, న్యూఢిల్లీ: గర్భధారణ, మాతృత్వపు హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టపరమైన సురక్షిత గర్భస్రావం మహిళలందరికీ సమానంగా వర్తించే హక్కేనని తేల్చిచెప్పింది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయిన వారితో సమానంగా అవివాహితులకు కూడా 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. అంతేగాక వైవాహిక అత్యాచారాన్ని కూడా వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్ట నిర్వచనం ప్రకారం రేప్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంటీపీ చట్ట పరిధిని విస్తరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ ఎ.ఎన్.బొపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ సురక్షిత అబార్షన్ దినోత్సవం (సెప్టెంబర్ 28) మర్నాడే ఈ తీర్పు రావడం విశేషం. కాలంతో పాటు చట్టాలూ మారాలి వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్టం సెక్షన్ 3(2)(బీ)ప్రకారం వివాహితలతో పాటు అత్యాచార బాధితులు, మైనర్లు, మానసిక సమస్యలున్న వారు, పిండం సరిగా అభివృద్ధి చెందని సందర్భాల్లో 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కుంది. అవివాహితలు, వితంతువులు తమ ఇష్టం మేరకు గర్భం దాలిస్తే 20 వారాల వరకు మాత్రమే అబార్షన్‌కు అవకాశముంది. ఈ తేడాలు వివక్షేనని ధర్మాసనం పేర్కొంది. చట్టాలు స్థిరంగా ఉండరాదని అభిప్రాయపడింది. వాటిని కాలానుగుణంగా మార్చుకోవాల్సిన అవసరముందని 75 పేజీల తీర్పులో పేర్కొంది. ‘‘ఎంపీటీ నిబంధనలను కూడా మెరుగుపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని కనాలా, వద్దా అన్నది మహిళ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం ఆమెకున్న వ్యక్తిగత స్వేచ్ఛ. దీనికి వైవాహిక స్థితితో నిమిత్తం లేదు. సహజీవనాలను కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే గుర్తించింది. కనుక 24 వారాల్లోపు సురక్షిత అబార్షన్ హక్కును వివాహితలకే పరిమితం చేసి అవివాహితలకు, ఒంటరి మహిళలకు నిరాకరించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. చట్టానికి సంకుచిత భాష్యం చెప్పడమే. ఇందులో ఎలాంటి హేతుబద్ధతా లేదు’’అని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినం మర్నాడే తీర్పు వెలువడిందని ఒక లాయర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ఇది యాదృచ్ఛికమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వైవాహిక అత్యాచారానికి గురైనా అబార్షన్ చేయించుకోవచ్చు వైవాహిక అత్యాచారాన్ని కూడా ఎంటీఐ చట్టానికి సంబంధించినంత వరకు అత్యాచారం పరిధిలోకి తేవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘అత్యాచారమంటే మహిళ తన సమ్మతి లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనాల్సి రావడం. అపరిచితులు మాత్రమే రేప్‌లకు, లైంగిక వేధింపులకు పాల్పడతారన్న అపోహ మనలో ఉంది. భర్త/జీవిత భాగస్వామి చేతిలో లైంగిక వేధింపులు చిరకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలే. కాబట్టి దీన్ని కూడా అత్యాచారంగానే పరిగణిస్తూ, తద్వారా దాల్చే బలవంతపు గర్భం బారినుంచి మహిళలను కాపాడాల్సి ఉంది’’అని పేర్కొంది. సదరు మహిళకు కూడా ఎంటీపీ చట్టం సెక్షన్ 3(బి)(ఎ) ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భర్త చేతుల్లో లైంగిక వేధింపులను, బలవంతపు లైంగిక సంపర్కాన్ని ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచారంగా పరిగణించాలా, లేదా అన్నది మరో ధర్మాసనం విచారణలో ఉందని గుర్తు చేసింది. దీనిపై ఆ ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. మైనర్ల పేరు వెల్లడించాల్సిన పని లేదు ఎంటీపీ చట్టం ప్రకారం మైనర్లకు కూడా 20–24 వారాల వ్యవధిలో గర్భస్రావానికి అనుమతి ఉందని ధర్మాసనం పేర్కొంది. మైనర్‌కు అబార్షన్ చేయాల్సిన సందర్భంగా పోక్సో చట్టం మేరకు పోలీసు రిపోర్టు తప్పనిసరే అయినా బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలను వైద్యులు తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పోక్సో చట్టాన్ని సామరస్యపూర్వకంగా వర్తింపజేయాలని సూచించింది. ‘‘వివాహితలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారన్నది సరికాదు. అవివాహితలు, మైనర్లు కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, లేదా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవడం జరుగుతోంది. ఇవి కొన్నిసార్లు గర్భధారణకూ దారితీస్తున్న సత్యాన్ని విస్మరించలేం. దేశంలో సరైన లైంగిక ఆరోగ్య విద్య లేక చాలామందికి కౌమారదశలో పునరుత్పత్తి వ్యవస్థ, సురక్షిత లైంగిక పద్ధతులు, గర్భనిరోధక పరికరాలు, పద్ధతుల గురించి తెలియడం లేదు. ఈ సమాచారం అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలు, గుర్తింపు పొందిన వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. కులం, సామాజిక, ఆర్థిక కారణాలతో చికిత్సను నిరాకరించరాదు’’అని ఆదేశించింది. ఇవన్నీ వాస్తవరూపం దాల్చినప్పుడు మాత్రమే మహిళల శారీరక స్వయంప్రతిపత్తి హక్కు సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. కుటుంబీకుల అనుమతీ అక్కర్లేదు చట్టపరమైన అబార్షన్ చేయించుకోవడానికి మహిళలకు కుటుంబ సభ్యుల సమ్మతి అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సభ్యుల సమ్మతి, డాక్యుమెంటరీ రుజువులు, న్యాయపరమైన అనుమతి అంటూ వైద్యులు చట్టానికి మించిన షరతులు పెడుతున్నారు. అవి లేవంటూ అబార్షన్‌కు నిరాకరిస్తున్నారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఇది నిజంగా విచారకరం. ఆ కారణాలతో వైద్యులు అబార్షన్ నిరాకరించడానికి వీల్లేదు. గర్భాన్ని తొలగించుకోవాలనుకునే మహిళ ఎంటీపీ చట్ట నిబంధనలను పాటించేలా చూసుకుంటే చాలు’’అని పేర్కొంది. ‘‘సదరు గర్భానికి భర్త/భాగస్వామి అంగీకారం ఉందా? పుట్టబోయే బిడ్డ బాధ్యతను వారు కూడా సమానంగా స్వీకరిస్తారా? గర్భధారణ, కాన్పు ఖర్చులను కుటుంబం భరిస్తుందా? ఇలాంటివన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలు. సదరు మహిళకు మాత్రమే తెలిసే విషయాలు. కాబట్టి గర్భాన్ని ఉంచుకోవాలా, లేదా అన్నది నిర్ణయించుకోవాల్సింది కేవలం ఆమె మాత్రమే. అంతే తప్ప సంకుచిత పితృస్వామిక సూత్రాల ఆధారంగా చట్టం నిర్ణయించే పరిస్థితి ఉండకూడదు’’అని స్పష్టం చేసింది. ఇదీ నేపథ్యం... ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల అవివాహితకు 23 వారాల 5 రోజుల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఇష్టపడే గర్భం దాల్చినా ఆ తర్వాత భాగస్వామి పెళ్లికి నిరాకరించి తనను వదిలేశాడని పేర్కొంది. కానీ ఆమె గర్భానికి 20 వారాలు దాటినందున ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్‌కు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అపీలు చేసుకుంది. అబార్షన్‌కు అనుమతిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎంటీపీ చట్టానికి 2021లో చేసిన సవరణ ద్వారా భర్త అనే పదాన్ని భాగస్వామిగా మార్చిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. తుది విచారణ జరిపి ఆగస్టు 23న వాదనలు ముగించింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది. చట్టపరంగా సురక్షిత అబార్షన్ చేయించుకోవడానికి మహిళలందరూ అర్హులే. గర్భిణులు 20–24 వారాల మధ్య అబార్షన్ చేయించుకోవచ్చని గర్భవిచ్ఛిత్తి చట్టం సెక్షన్ 3(2)(బీ) చెబుతోంది. దీన్ని వివాహితులకే వర్తింపజేసి అవివాహితులను దూరం పెట్టడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే స్త్రీకి తన శరీరంపై సంపూర్ణ హక్కుంటుంది. అవాంఛిత గర్భం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కనుక పెళ్లయిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అబార్షన్‌పై ఆమెదే అంతిమ నిర్ణయం. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్టు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల సమ్మతీ అవసరం లేదు. మైనర్, లేదా మానసిక వైకల్యమున్న వారికి మాత్రమే సంరక్షకుల సమ్మతి అవసరం . – జస్టిస్ డీవై చంద్రచూడ్ -
ప్రేమజంటకు రక్షణ కల్పించాలి
అల్లిపురం(విశాఖ దక్షిణ): మతాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంటకు రక్షణ కల్పించాలని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ డిమాండ్ చేశారు. గురువారం డాబాగార్టెన్స్లో గల వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కత్తి పద్మ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆనందపురం గ్రామానికి చెందిన చందక సత్య, అదే గ్రామానికి చెందిన షేక్ భాషా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సత్య, భాషా ఫిబ్రవరి 7న ఇంటి నుంచి పారిపోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు భాషా బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడే కాపు కాసి ఉన్న సత్య బంధువులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకుపోయారు. అనంతరం తనంతట తానే ఇంటి నుంచి వెళ్లిపోయానని సత్యతో ఆమె తల్లిదండ్రులు లెటర్ రాయించి ఆనందపురం పోలీస్ స్టేషన్లో అందజేశారు. సత్య తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు లెటర్ తీసుకుని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అనంతరం సత్యను ఆమె తల్లిదండ్రులు పైడిభీమవరం దగ్గర ఒక గ్రామంలో ఆమె మేనత్త ఇంటి దగ్గర దాచివేశారు. కానీ సత్య ఫిబ్రవరి 26న భాషాకు ఫోన్ చేసి అదే రోజు విజయనగరం వెల్లిపోయింది. అక్కడ సత్య, భాషా కలిసి మహిళా చేతనను ఆశ్రయించారు. దీంతో మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్య వారిద్దరికీ తిరిగి సింహాచలం దేవస్థానంలో వివాహం జరిపించారు. అయితే సత్య కుటుంబసభ్యులు భాషా ఇంటికి వెళ్లి భాషాను, వారి కుటుంబసభ్యులను చంపేస్తామని గ్రామపెద్దల సమక్షంలోనే బెదిరించటంతో వారు భయాందోళనకు గురవుతున్నారని, ఆనందపురం పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారని కత్తి పద్మ ఆరోపించారు. భాషా, సత్య మేజర్లు కావడంతో వారు వివాహం చేసుకునే హక్కు కల్పిస్తూ, వారికి రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
పెళ్లి కాని వారికే ప్రమాదం ఎక్కువ
న్యూయార్క్ : పెళ్లంటే నూరేళ్ళ మంట అని కొందరు సమర్ధించడం, మనం వినే ఉంటాం. అయితే ఇది ముమ్మాటికీ తప్పేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పెళ్లి అయిన వారి కంటే పెళ్లి కాని వారికే గుండె సంబంధిత వ్యాధుల్లో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులతో మరణించడం, వైవాహిక స్థితికి ఉన్న సంబంధాన్ని తెలుపుతూ పరిశోధకులు మొదటిసారి అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గుండె సంబంధిత పేషెంట్లపై వివాహ ప్రభావం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి యూనివర్సిటీలో పనిచేసే మెడిసిన్ ప్రొఫెసర్, లీడ్ రీసెర్చర్ అర్షద్ క్వియుమి చెప్పారు. వివాహంతో కేవలం సోషల్ సపోర్టు మాత్రమే కాక, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. గుండె సంబంధిత వ్యాధుల వారికి వివాహం చాలా ముఖ్యమని చెప్పారు. కాగా, పరిశోధకులు అంతకముందు జరిపిన అధ్యయనాల్లో విడాకులు తీసుకున్న వారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో పెళ్లి కాని వారే ఎక్కువగా మరణం బారిన పడుతున్నారని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. కరొనరీ అర్టరీ వ్యాధికి కార్డియాక్ కాథెటరైజేషన్ చికిత్స తీసుకుంటున్న 6,051 మంది పేషెంట్లపై జరిపిన అధ్యయనంలో విడాకులు తీసుకున్న, అవివాహిత, వితంతువుల ఫలితాలు చాలా ప్రతికూల ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. వివాహం చేసుకున్న పేషెంట్లకు, అవివాహిత షేషెంట్లకు మధ్య జరిపిన ఈ అధ్యయనంలో, ఏ వ్యాధి కారణం చేతనైనా మరణించే వారిలో 24 శాతం మంది అవివాహిత పేషెంట్లు ఉంటారని, అదేవిధంగా హృదయ సంబంధ వ్యాధి నుంచి అయితే 45 శాతం మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. పెళ్లి కాని వారికే 40 శాతం ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పేషెంట్లపై నాలుగేళ్లుగా జరిపిన అధ్యయనం అనంతరమే పరిశోధకులు ఈ ఫలితాలను వెలువరించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
‘నాకు పెళ్లైంది.. పాప కూడా ఉంది’
-
‘నాకు పెళ్లైంది.. పాప కూడా ఉంది’
ముంబై: సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్-10 విజేత మన్ వీర్ గుర్జర్ వైవాహిక స్థితిపై స్పష్టత వచ్చింది. అతడి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అనుమానాలు తలెత్తాయి. వీటన్నింటికీ మన్ వీర్ సమాధానం ఇచ్చాడు. తనకు పెళ్లైందని, ఒక పాప కూడా ఉందని వెల్లడించాడు. తన పెళ్లి గురించి ఎవరి దగ్గర దాయలేదని పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, భావోద్వేగపు బెదిరింపులతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. తనకు పెళ్లైన విషయాన్ని బయటపెట్టకపోవడం వెనుక ఎటువంటి అజెండా లేదని అన్నాడు. ‘నాకు పెళ్లైందా, లేదా అనేది బిగ్ బాస్ లో నా ప్రదర్శనకు సంబంధించిన అంశం కాదు. నా వైవాహిక స్థితి గురించి వెల్లడించలేదని ప్రజలు అనుకుంటున్నారు. అది నిజం కాద’ని మన్ వీర్ స్పష్టం చేశాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి బిగ్ బాస్-10లో పాల్గొన్నాడని అతడిపై విమర్శలు వచ్చాయి. మన్ వీర్ కు పెళ్లైన విషయాన్ని అతడి తండ్రి మహరాజ్ సింగ్ కూడా ధ్రువీకరించాడు. ‘అవును మన్ వీర్ కు పెళ్లైంది. ఇది జరిగి మూడేళ్లు అయింది. అయితే పెళ్లి చేసుకోవడం అతడికి ఇష్టం లేదు. ఏడాదిన్నర తర్వాత మన్ వీర్, అతడి భార్యకు మధ్య సమస్యలు తలెత్తాయి. అవన్నీ భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు. వాటి గురించి మన్ వీర్ మాత్రమే చెప్పగలడు. నా కోడలు, ఏడాదిన్నర మనవరాలు మాతోపాటే ఉంటున్నారు. తన వైవాహిక స్థితి గురించి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా మన్ వీర్ చెప్పాడ’ని మహరాజ్ తెలిపారు. కాగా, మన్ వీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. అతడు తీసుకున్న ఆహారం విషతుల్యంగా మారడంతో ఆస్పత్రి పాలయ్యాడు. సామాన్యుడు ‘బిగ్ బాస్’ అయ్యాడు -
'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'
వయసు, పెళ్లి అనే విషయాలు హీరోలకు పెద్దగా అడ్డు రాకపోయినా హీరోయిన్ల కెరీర్‌కు ఈ అంశాలు చాలా కీలకం. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న భామలను హీరోయిన్ క్యారెక్టర్స్‌కు తీసుకోవటం చాలా అరుదు. అయితే అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ బ్యూటీ తన పెళ్లి తరువాత ఇండస్ట్రీ వర్గాల నుంచి తనకు వచ్చిన సలహాలను మీడియాతో పంచుకుంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రాధిక ఆప్టే. ఎక్కువగా హోమ్ లీ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ భామ బద్లాపూర్ సినిమాతో పాటు, అహల్య షార్ట్ ఫిలింతో బోల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తరువాత తను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులను వివరించింది. తను పెళ్లి చేసుకున్న విషయం దర్శక నిర్మాతలకు తెలిసి, వారు ఆ విషయాన్ని దాచిపెట్టామన్నారని తెలిపింది. అయితే తన భర్త లండన్‌లో ఉంటున్న కారణంగా తాను కొద్ది రోజులు షూటింగ్లో ఉంటే, మరికొద్ది రోజులు భర్త దగ్గరకు వెళ్లాల్సి ఉంటుదని, కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టడం కష్టం అని వారికి తేల్చి చెప్పేసిందట. అంతేకాదు పెళ్లి తరువాత కూడా తను గతంలో చేసినట్టుగా అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ అంటుంది. -
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు...
-
మోడీ - పెళ్లికాని ప్రసాదు కాదు... పెళ్లి దాచిన ప్రసాదు
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అవివాహితుడు కారు. ఆయనకు నలభై అయిదేళ్ల క్రితమే పెళ్లైంది. అంతే కాదు. ఇన్నాళ్లూ ఆయన వివిధ ఎన్నికల అఫిడవిట్లలో వైవాహిక జీవితానికి సంబంధించిన కాలమ్ ను ఖాళీగా వదులుతూ వచ్చారు. బుధవారం వడోదరలో నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆయన తాను వివాహితుడని, తన భార్య పేరు యశోదా బెన్ అని చెప్పుకున్నారు. దీంతో నరేంద్ర మోడీ రహస్యమయ వ్యక్తిగత జీవితం పై మరిన్ని ఊహాగానాల తేనెతుట్టెని కదిలించినట్టయింది. తాను పెళ్లి చేసుకున్నట్టు మోడీ మొట్టమొదటిసారి అంగీకరించారు. యశోదాబెన్ తో మోడీకి వివాహమైన విషయం గుజరాత్ లో బహిరంగ రహస్యం. మోడీ స్వగ్రామం వడ్ నగర్ కి పది కి.మీ దూరంలోని ఒక ఊళ్లో యశోదాబెన్ టీచర్ గా పనిచేస్తున్నారు. స్థానిక బిజెపి కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇన్నేళ్ల తరువాత మోడీ తనకు పెళ్లైన విషయాన్ని ఒప్పుకున్నారు. ఆమె ఆస్తిపాస్తుల విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పుకున్నారు. కానీ మోడీ ఈ విషయాన్ని తన అఫిడవిట్లలో ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదు? 2012 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లోనూ దీని గురించి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా తనకు పెళ్లైన విషయాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఎన్నికల తరువాత తన వైవాహిక స్థాయి విషయంలో వివాదం తలెత్తకూడదనే ఇలా చేశారా? బిజెపి తరఫు నుంచి కూడా దీని గురించి ఎవరూ స్పష్టీకరణనివ్వడం లేదు. మోడీ తనకు పెళ్లైందా లేదా అన్న విషయాన్ని అఫిడవిట్ లో స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోడీ మొదటిసారి ఈ వెల్లడి చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఇది వివాదమై, తాను ప్రధాని కాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఇలా చేశారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోదీ అన్నగారైన దామోదర్ దాస్ మోడీ మాత్రం మోడీకి బాల్య వివాహం జరిగిందని, అప్పట్లో తమ కుటుంబంలో ఇలాంటి విషయాల పట్ల అవగాహన లేదని, కుటుంబంలో ఎవరూ అప్పట్లో పెద్దగా చదువుకున్న వారు లేరని ఒక ప్రకటనలో తెలియచేశారు. తరువాత కాలంలో మోడీ పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. ఆరెస్సెస్ ప్రచారక్ కావాలని నిర్ణయించుకున్న తరువాత ఆయన పూర్తిగా బ్రహ్మచర్య జీవనాన్నే పాటించారు.