Ahalya
-
గొప్ప పరిపాలనా దక్షురాలు..
దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహిల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వద్ద గల చోండి గ్రామంలో అహిల్యాబాయి 1725 మే 31న జన్మించారు. ఆమె తల్లి సుశీలా షిండే, తండ్రి మంకోజీ షిండే. నేటి రాజకీయ భాషలో సంచార తెగల కుటుంబం ఆమెది. చిన్న నాటనే ఆమెకు గల భక్తి, నిర్భీతి చూసి మల్హార రావు హోల్కర్(మరాఠా సుబేదారు) ముగ్ధుడయ్యారు. తన కుమారుడు ఖాండేరావు హోల్కర్కు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడామె వయస్సు పదేళ్లు, పెళ్లి కొడుకు వయస్సు పన్నెండేళ్లు. అలా రాజ కుటుంబంలోకి ప్రవేశించింది. అక్కడే యుద్ధ విద్యలు, ప్రజా పాలనా విద్యలు నేర్చింది. వారి మామగారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించింది. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరింది.అయితే, భర్త ఖాండే రావు 1754లో, తండ్రి వంటి మామ మల్హార రావు 1766లో, తర్వాతి ఏడాది కుమారుడు మాలే రావు... ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఈ పిడుగుపాటు ఘటనలతో అహిల్య కుంగిపోలేదు. 16 యేండ్ల కుమారుణ్ణి కోల్పోయిన దుఃఖంలోనే 1767లో సింహాసనం అధిరోహించారు. శివ భక్తురాలుగా శివుని ప్రతినిధిగా పరిపాలన చేపట్టారు. ఇండోర్‌కు దూరంగా, నర్మదా నదీ తీరాన ఉన్న మహేశ్వర్ (మధ్య ప్రదేశ్) గ్రామాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించారు. అది సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు మంచి ఉదాహరణ.గొప్ప సంస్కరణ వాది..మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులకు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు... ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు ఆమె తీసుకున్నారు. ఆమె పాలనలో అడవుల నరికివేతను నిషేధించారు. ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి. వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం, నీటి నిల్వకు ట్యాంకులు, నదులపై ఘాట్లు నిర్మించారు. వస్త్ర పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహేశ్వరీ చీరలు అంటే ఇప్పటికీ మంచి పేరే ఉంది!భిల్లులు, గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే భిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు. ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, అభివృద్ధి పథకాలు చేపట్టారు.హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం..తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. 1783లో జైపూర్ రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యాన్ని నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలో శతఘ్నులను పేల్చాడు.ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు. తన రాజ్యంలో అన్ని కులాల, మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టిప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు. ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. వివిధ రాజులతో మిత్రత్వం నడిపి, నూతన దౌత్య విధానాలకు దారి చూపారు. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలోని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగారు.సాధారణంగా కవులు... రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు. ‘నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు. ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి’ అనేది. అయినా ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు గౌరవించారు. 1795 ఆగస్ట్ 13న తన 70వ ఏట తనువు చాలించిన ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు. ఆమె జన్మించి 300 ఏళ్లయింది. కర్మ యోగిగా, మాతృత్వం నిండిన రాణిగా ఆమెను పేర్కొనడం సముచితం. – శ్యాంప్రసాద్ జీ, అఖిల భారతీయ సంరసతా ప్రముఖ్ (నేటి నుంచి అహిల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాలు ప్రారంభం) -
అహల్య... రాయిగా మారిందా?
మనలో చాలామందికి అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాదం సోకగానే తిరిగి నాతిగా మారిందనే విషయమే స్ఫురణకు వస్తుంది. అయితే, అహల్య వృత్తాంతం భిన్నమైంది. అహల్య రాయిగా మారటం పూర్తి అవాల్మీకాంశం. ఆమె బ్రహ్మ మానస పుత్రిక. అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. అహల్య ఉదంతం మనకు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది. తాటకను సంహరించిన తర్వాత రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరాధీశుడు జనక మహారాజును సందర్శించడానికి వెళ్లే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న వనంలో ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఆ ఆశ్రమం ఎందుకో రాముని ఆకట్టుకోవడంతో ఈ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారు అని విశ్వామిత్రుని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. గౌతముడు ఇంద్రుని తీవ్రంగా శపించిన తర్వాత అహల్యను కూడా శపిస్తాడు. ‘వేలాది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే పడి ఉంటావు. భస్మశాయినివై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథనందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినపుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు.. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు’’ అని శపించి హిమాలయాలకు వెళ్లి పోయాడు’’ అని చెప్పి మూల రామాయణంలో ఈ గాథను విశ్వామిత్రుడు శ్రీరాములవారికి తెలుపుతూ, అహల్యను తరింప చేయమని కోరుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలసి గౌతమముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. గుర్తుపట్టలేని రీతిలో ఉన్న అహల్య కనిపిస్తుంది. ఇక్కడ వాల్మీకి ఆమె వాయుభక్షణాది కఠోరదీక్షితో, తపఃప్రభావం వలన ఆమె కాంతిమయంగా కనపడుతున్నట్లు వర్ణన ఉధృతిని పెంచుతాడు. చివరకు పొగ ఆవరించి ఎవరికీ కనిపించని రీతిలో ఉందంటాడు. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగిందంటాడు. ఆ తర్వాతే అందరికీ ఆమె కనపడుతుంది అని కూడా చెప్తాడు. అప్పుడు రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు. ఆమె తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ తిరిగి వీరి పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయిన తర్వాత రామాగమాన్ని గ్రహించి గౌతముడు అక్కడికి చేరుకుని అహల్యాసమేతుడై శ్రీ రాముని సేవిస్తాడు. ఈ గాథలో అహల్య రాయిగా మారినట్లు కనపడదు. విశ్లేషించి ఆలోచిస్తే గౌతముడు అహల్య తొందరపాటు తనాన్ని నిరసించి, ఆమెను శాసించి త్యజిస్తాడు. అహల్య పశ్చాత్తాపంతో సమాజంలో కలవక అదే ఆశ్రమంలో ఒంటరై నివసించడం వల్ల, నిరాశానిస్పృహలతో ఉండటంవల్ల ఆమె వస్త్రాలు జీర్ణమైపోయి, దుమ్ము చేరి గుర్తించేందుకు వీలు కాకుండా ఉంటుంది. వాల్మీకి వర్ణనావిశేషణాలతో రసోధృతిని పెంచగా, అనువాదకులు అనంతరకాలంలో రాముని మహిమను మరింతగా చాటి చెప్పే ప్రయత్నం చేశారు. వాల్మీకి తదనంతర కవులు నాటకీయతను, స్థానికతను జోడించి, అహల్య రాయిగా మారిందని శ్రీరాముని పాదపద్మం సోకగానే ఆమె శాపవిమోచనం పొందిందని మార్పులు చేర్పులు చేసి రచించారు. అదే తర్వాత దృశ్యకావ్యాల్లో కూడా కనపడడం వల్ల ప్రజల మనసుల్లో స్థిరమై పోయింది. వాల్మీకి రామాయణంలో అహల్య వృత్తాంతం గురించి ప్రస్తావన ఉంది. భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందనే కథనాలు ఉన్నాయి. అద్భుత సౌందర్యవతి అయిన అహల్యను ఎందరో తమ సతిగా చేసుకోవాలనుకుంటారు. అయితే, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోడానికి అర్హులని బ్రహ్మ ప్రకటించాడు. దీంతో, తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు, అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు. అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు. అదెలాగని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో– గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని, అలా ఒక రోజు ప్రదక్షిణలు చేస్తుండగా లేగ దూడకు ఆవు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గో ప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలిపాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి వివాహం జరిపించమని అన్నాడు. దీంతో అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేశాడు. అహల్యను భార్యగా పొందలేకపోయిన ఇంద్రుడు, గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చుకున్నాడని అంటారు. కానీ ఇది కూడా నిజం కాదని కొందరంటారు. అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఓ పథకం వేశాడు. అతడు కామక్రోధ మదమాత్సర్యాలను జయించాడా? లేదా? అని తెలుసుకోడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య చెంతకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అయితే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలం పాటు విచలితురాలయింది. ఆమె మనసును చంచలం చెయ్యగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు. అప్పుడు సత్యం బోధపడిన ముని పత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడినుంచి వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈ లోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంతో ఇద్దరినీ శపించాడు. అలా ఆయనకు ఇంద్రపదవిని దేవేంద్రుడు దూరం చేశాడు. అలాగే, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని గౌతముడు ఆమెను శపించాడు. కానీ రాయివి కమ్మని అనలేదు. జనబాహుళ్యంలో బలంగా చొచ్చుకుపోయి ఉన్నకథలలో చాలా వరకు ప్రక్షిప్తాలే. అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు జనకుడి ఆస్థాన పురోహితుడు. వీరి కుమార్తె అంజన, హనుమంతుడి తల్లి. అంటే అహల్య గౌతముడి అమ్మమ్మ అన్నమాట. అహల్య పంచకన్యల్లో స్థానం సంపాదించుకోగలిగిందంటేనే ఆమె పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
'నా పెళ్లి విషయం దాచి పెట్టమన్నారు'
వయసు, పెళ్లి అనే విషయాలు హీరోలకు పెద్దగా అడ్డు రాకపోయినా హీరోయిన్ల కెరీర్‌కు ఈ అంశాలు చాలా కీలకం. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న భామలను హీరోయిన్ క్యారెక్టర్స్‌కు తీసుకోవటం చాలా అరుదు. అయితే అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ బ్యూటీ తన పెళ్లి తరువాత ఇండస్ట్రీ వర్గాల నుంచి తనకు వచ్చిన సలహాలను మీడియాతో పంచుకుంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అందాల భామ రాధిక ఆప్టే. ఎక్కువగా హోమ్ లీ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన ఈ భామ బద్లాపూర్ సినిమాతో పాటు, అహల్య షార్ట్ ఫిలింతో బోల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తరువాత తను ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులను వివరించింది. తను పెళ్లి చేసుకున్న విషయం దర్శక నిర్మాతలకు తెలిసి, వారు ఆ విషయాన్ని దాచిపెట్టామన్నారని తెలిపింది. అయితే తన భర్త లండన్‌లో ఉంటున్న కారణంగా తాను కొద్ది రోజులు షూటింగ్లో ఉంటే, మరికొద్ది రోజులు భర్త దగ్గరకు వెళ్లాల్సి ఉంటుదని, కాబట్టి ఈ విషయాన్ని దాచిపెట్టడం కష్టం అని వారికి తేల్చి చెప్పేసిందట. అంతేకాదు పెళ్లి తరువాత కూడా తను గతంలో చేసినట్టుగా అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ అంటుంది. -
సెలబ్రిటీల... షార్ట్ కట్
సమాజంలోని రుగ్మతలపై... ఇదివరకూ తమ సినిమాల్లో సందేశాలు ఇచ్చేవారు సినీతారలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. షార్ట్‌ఫిల్మ్ ఫీవర్ సెలబ్రిటీలను పట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులపై... స్పందించడానికి షార్ట్‌ఫిల్మ్ ఆయుధంగా మారింది. అది ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలకు ప్రతిఘటన కావచ్చు! మూర్ఖపు భావజాలంపై పోరు కావచ్చు! ఎయిడ్స్ లాంటి రోగాలపై అవగాహన కల్పించడం కావచ్చు!! ఇలా ప్రతి దానికీ ఒకటే - ‘షార్ట్ ’కట్..! అల్లు అర్జున్ ఏడాది క్రితమే ఇలాంటి ప్రయత్నం చేస్తే తాజాగా గాయని స్మిత, రానున్న రోజుల్లో తాప్సీ - అందరూ ఇప్పుడు షార్ట్‌ఫిల్మ్ రూట్లోనే! అబ్బాయిలూ... ఏడవండి బాబూ! ‘మగపిల్లలు ఏడవకూడదురా’ అంటూ చిన్నప్పుడే వాళ్ల ఏడుపుకి అడ్డుపుల్ల వేసేస్తాం. వాడి మనసులో కూడా ‘నేను మగాణ్ణి నాకేంటి’ అనే భావం బలంగా నాటుకుపోతుంది. పెద్దవాడవుతాడు. ఏడవడు. వాడు ఏడ్వకపోతే పోయాడు.. అమ్మాయిలను ఏడిపించడం మొదలుపెడతాడు. ‘‘ఏడుపంటే ఏమిటో తెలియని అబ్బాయికి... అమ్మాయి ఏడుపు తాలూకు విలువ ఏం తెలుస్తుంది?.. అందుకే అబ్బాయిలనూ ఏడ్వనిద్దాం...’’ అంటున్నారు నటి మాధురీ దీక్షిత్. వినీత్ మ్యాథ్యూ దర్శకత్వం లోని ‘స్టార్ట్ విత్ ది బాయ్స్’ లఘు చిత్రం ఇది. అర్ధరాత్రి... ఒంటరి అమ్మాయి! అర్ధరాత్రి... ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది ఆ అమ్మాయి. ఇంతలో కారు ముందుకెళ్లనని మొరాయించింది. ఈలోపు అటువైపుగా కారులో వెళుతున్న కొంతమంది యువకులు ఆ అమ్మాయిని చూశారు. అబ్బాయి లకు ఏవేవో ఊహలు. కారు ఎంతకీ బాగవ్వకపోవడంతో వాళ్ల కారులో డ్రాప్ చేయమంటుంది. ఏదేదో చేయొచ్చని మళ్లీ అబ్బాయిలు ఊహల్లో విహరిస్తారు. ఈలోపు ఇల్లు రానే వస్తుంది. అమ్మాయి థ్యాంక్స్ చెప్పి ఇంట్లోకెళ్లి పోతుంది. ‘గోయింగ్ హోమ్’ కథ ఇది. ఒంటరి ఆడపిల్ల రోడ్డు మీద కనబడితే నీకేం కాదు.. మేం ఇంటి దగ్గర సేఫ్‌గా దిగబెడతాం అని భరోసా ఇవ్వ లేమా? అని ప్రశ్నిస్తాడు దర్శకుడు. ‘క్వీన్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిం చిన ఈ చిత్రంలో ఆలియా భట్ నటించారు. అహల్యను టచ్ చేస్తే..! ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. ఆవిడకు ఓ పాతికేళ్లుంటాయ్. ఆ ఇంట్లోకి వచ్చినవాళ్లు వచ్చినట్లు మాయమైపోతారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఓ పోలీసాఫీసర్ ఆ ఇంటికి వెళతాడు. వయసులో ఉన్న అమ్మాయిని చూసి, మోహిస్తాడు. మాటల మధ్య ఆ ముసలాయన ఓ రాయిని చూపిస్తూ, దీన్ని టచ్ చేసి, మేడ పైకి వెళ్లి, ఆ అమ్మాయికి సెల్‌ఫోన్ ఇచ్చినవాళ్లు తనలా మారిపోతారని చెబుతాడు. ఆఫీసర్ ఆశ్చర్య పోతాడు. రాయిని టచ్ చేసి, మొబైల్ తీసుకుని పెకైళ్తాడు. అహల్య అతణ్ణి తన భర్తే అనుకుని, చేతులు చాచి రమ్మంటుంది. అప్పుడేమైంది? ‘కహానీ’ చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ ‘అహల్య’ను తెరకెక్కించారు. అహల్యగా రాధికా ఆప్టే నటించారు. దీన్ని థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంతో నెటిజన్లు ఫిదా. వ్యసనాలకు బానిసైతే... అతను ఓ ఫొటోగ్రాఫర్... భార్య, ఓ కొడుకుతో జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆ ఫొటోగ్రాఫర్‌కు అమ్మాయిల పిచ్చి. ఫొటోలు దిగడానికి వస్తున్న మోడల్స్‌తో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడు. కుటుంబాన్ని పట్టించుకోడు. పాపం.. భార్యే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కొడుకు పెద్దవాడవుతాడు. అతనూ ఫొటోగ్రాఫర్ అవుతాడు. కాలం గడుస్తుంది. ఇంతలో ఆ కొడుక్కి తల్లి దగ్గర నుంచి ఫోన్.. తండ్రికి ఎయిడ్స్ వచ్చిందని. వెంటనే బయలుదేరి వస్తాడు. తల్లి బతిమా లడంతో హాస్పిటల్లో ఉంటున్న తండ్రిని దగ్గరుండి చూసుకుంటాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఆఖరి రోజుల్లో తండ్రిని కంటికి రెప్పలా కాపాడు కుంటాడు. ‘పాజిటివ్’ పేరుతో బాలీవుడ్ దర్శక, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో ఎయిడ్స్ రోగిగా బొమన్ ఇరానీ, ఆయన భార్య పాత్రలో షబానా అజ్మీ నటిం చారు. ఒక వ్యసనం అందమైన కుటుంబంలోని సంతోషాలను ఎలా దూరం చేసింది? అనే అంశాన్ని కళ్లకు కట్టారు ఫర్హాన్ అక్తర్. నేను నేనులా ఉంటా! మహిళలు అంతరిక్షంలోకి అడుగుపెట్టినా, ఇంకా వంటింటి కుందేళ్లు అనే భావన ఉన్న మగవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ భర్త ఉద్యోగం చేస్తానన్న తన భార్యను వద్దంటాడు. అప్పుడు ఆ మహిళ దృఢంగా తీసుకున్న నిర్ణయం, చెప్పిన జవాబు నేపథ్యంలో వచ్చిన షార్ట్‌ఫిల్మ్ ‘డైయింగ్ టు బి మి’. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో గాయని స్మిత కథానాయిక. సుకుమార్ దర్శకత్వంలో ఏడాది క్రితం అల్లు అర్జున్ ‘అయామ్ దట్ ఛేంజ్’ అని షార్ట్‌ఫిల్మ్ చేయగా, ఇప్పుడు సెలబ్రిటీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ భావ వ్యక్తీకరణకు సినిమా కన్నా దగ్గరి దారిగా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇవన్నీ నెట్లో హల్చల్ చేస్తూ, లక్షలాది వీక్షకులను సంపాదించడం విశేషం. హిట్లతో పాటు జనం మనసులోనూ ఆలోచన రేపితే, ఈ ‘షార్ట్’ కట్ ఫలించినట్లే! నో లైఫ్ కాదు... లైఫ్ ఎగైన్ క్యాన్సర్ భయంకరమైన వ్యాధే కావచ్చు, కానీ క్యాన్సర్ తర్వాత నో లైఫ్ కాదు...ై‘లెఫ్ ఎగైన్’ అని అంటున్నారు సీనియర్ నటి గౌతమి. ఓ యువతి జీవితం క్యాన్సర్ బారిన పడి ఎలా నలిగిపోయి, కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్న కథాంశంతో తెరకెక్కిన లఘుచిత్రం ‘లైఫ్ ఎగైన్’. హైమారెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, ఈ లఘుచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో గౌతమి కీలక పాత్ర పోషించారు. కేన్సర్ వచ్చాక దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ లఘు చిత్రం ట్రైలర్‌ను ఎంపీ కవిత మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.