Actress Radhika Apte Says Female Actors Are Paid Less Than Male Actors - Sakshi
Sakshi News home page

Radhika Apte: 'హీరోలకు సమానంగా రెమ్యునరేషన్‌, గౌరవం ఇవ్వాలి'..

Published Sun, Apr 9 2023 8:25 AM | Last Updated on Sun, Apr 9 2023 11:08 AM

Radhika Apte Says Female Actors Are Paid Less Than Male Actors - Sakshi

సంచలన నటీమణుల్లో రాధిక ఆప్టే ఒకరు. నటుడు ప్రకాష్‌ రాజ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్తే కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తరువాత రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన కబాలి, కార్తీ సరసన ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా వంటి చిత్రాలతో పాటు చిత్తిరం పేసుదడి –2, వెట్రిసెల్వన్‌ తదితర చిత్రాలలో నటించి తమిళ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే విధంగా కొన్ని చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలలో నటిస్తోంది.

అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని రాధికా ఆప్టే తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ సినిమా రంగంలో నటిస్తున్న హీరోయిన్లకు, ఇతర మహిళలకు పారితోషికం, పేరు, ఖ్యాతి ఇవన్నీ విషయాల్లోనూ హీరోలకు సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఇందుకోసం ఈ రంగంలో మహిళలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రస్తుతం హీరోయిన్‌లకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాలూ వస్తున్నాయని అన్నారు. ఇది సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలోనూ ఆడ, మగ అనే భేదం లేదు అనే పరిస్థితి నెలకొందని, మహిళలు సమానత్వం కోసం పోరాడుతున్నారని రాధిక స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement