
అవకాశాలంటూ లైంగిక వేధింపులు : నటి
సినిమా అవకాశాలంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ నటి రాధికాఆప్తే మరోసారి వివాదానికి తె ర లేపారు.
సినిమా అవకాశాలంటూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ నటి రాధికాఆప్తే మరోసారి వివాదానికి తె ర లేపారు. ఇటీవల సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటి రాధికాఆప్తే. ధోని చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా కబాలి చిత్రంలో రజనీకాంత్‌తో నటించి మరింత పాపులర్ అయ్యారు. అంతకంటే కూడా ఇప్పుడు శ్రుతిమించిన శృంగార సన్నివేశాల్లో నటించడం, టాప్ లెస్ దుస్తులు ధరించడం, నగ్నంగా నటించడం వంటి చర్యలతో ఈ ఉత్తరాది భామ కలకలం సృష్టిస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో అవకాశాల ఆశతో లైంగిక వేధింపులకు గురైన వారు చాలా మంది ఉంటారు. వారిలో ఎవరూ బయట పడలేదు. నటి రాధికాఆప్తే మాత్రం ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి మరోసారి సినీ వర్గాల్లో సెగలు పుట్టించారు. రాధికాఆప్తే ఇటీవల ఒక ఆంగ్ల చిత్రం కోసం నటించిన అశ్లీల దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు ఒక భేటీలో పేర్కొంటూ ఒక ద క్షిణాదికి చెందిన నటుడు తాను బస చేసిన హోటల్‌కు ఫోన్ చేసి మాట్లాడారన్నారు.
ఆయన మాటలు చాలా తప్పుగా ఉండడంతో తాను గట్టిగానే హెచ్చరించానని, అప్పటి నుంచి తనను దుర్బాషలతో గొడవ చేస్తున్నాడని తెలిపారు. అదే విధంగా ఒక హిందీ చిత్రంలో నటించడానికి అవకాశం కల్పిస్తానని చెప్పిన నిర్మాత తనను మరొకరి బెడ్ రూమ్‌లో గడపాలని అడిగారన్నారు. ఇది చాలా అనాగరికం అని తనను బెడ్ రూమ్‌కు రమ్మన్న వాడు నరకానికి పోతాడని చెప్పానని అన్నారు. ఇంతకీ తనను వేధింపులకు గురి చేసిన ఆ దక్షిణాది నటుడు ఎవరన్నది మాత్రం రాధికాఆప్తే బయట పెట్టలేదు.ఏదేమైనా చిత్ర పరిశ్రమలో నటి రాధికాఆప్తే హాట్ టాపిక్‌గా మారారు.