
ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు, చిన్నారులకు ఆ టార్చర్ ఉందంటోంది నటి రాధికా ఆప్తే. కబాలి, ధోని, అళగురాజా వంటి తమిళ చిత్రాల్లో, టాలీవుడ్‌లో రక్తచరిత్ర, లయన్ మూవీల్లో నటించింది. బాలీవుడ్, హాలీవుడ్ మూవీల్లో నటిస్తోన్న ఈ అమ్మడికి ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవనే చెప్పాలి. ఆ మధ్య పడక గదికి రమ్మన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అర్ద నగ్న ఫొటోలను ఇంటర్నెట్‌లను పోస్ట్ చేసి వార్తలోకెక్కింది. తాజాగా సెక్స్ టార్చర్ ఆడవారికే కాదు మగవారికి, చిన్నారులకు ఉంటోందని మరో వివాదానికి తెరలేపింది.
అసలు రాధికా ఆప్తే ఏమందో చూద్దాం. ‘లైంగిక వేధింపులు సినిమారంగంలోనే కాదు బయట కూడ జరుగుతోంది. స్త్రీలపైనే కాకుండా పురుషులపైనా, పిల్లలపైనా హింసాత్మక సంఘటనలు, సెక్స్ టార్చర్లు జరుగుతున్నాయి. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యే. అధికార మదాంధులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనల్ని ఏ ఒక్క బాధితురాలో, బాధితుడో ఖండిస్తే చాలదు. పదిమంది ఒక్కసారిగా గొంతెత్తితే ప్రజల దృష్టిలో పడుతుంది. కాస్టింగ్ కౌచ్ కారణంగానే టార్చర్ సమస్య ఎదురవుతోందంటే అందుకు పాల్పడిన వారి పేరు ఎందుకు బయట పెట్టకూడదు అని అడుగుతున్నారని, అధికారం ఉన్న వాళ్లపై ఫిర్యాదు చేస్తే అలాంటి వారి భవిష్యత్ ఏమవుతుందో అందరికీ తెలుసునంటూ’ రాధికా ఆప్తే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment