కెరీర్ బిగినింగ్ డేస్‌లో నేనూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేశానని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటి, వీర్ ది హెడ్డింగ్ ఫేమ్ స్వర్ణ భాస్కర్. క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్. ఈ విషయం స్వర్ణ భాస్కర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రిలో తను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పుకొచ్చారు.
‘షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నాతో దురుసుగా ప్రవర్తించాడు. అతను నా చెవులను ముద్దాడే ప్రయత్నం చేస్తూ ‘ఐ లవ్ యూ బేబీ ’ అంటూ విచిత్రమైన చూపులతో సంజ్ఞ చేశాడు. దగ్గరకు వచ్చి తలపై చేయి వేసి దురుసుగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నాకు షూటింగ్ మానేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది. తర్వాత నేను అతన్ని పట్టించుకోలేదు’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment