చాలా రకాలుగా బాధిస్తున్నారు | Rai Laxmi React on casting couch | Sakshi

మహిళకేదీ మర్యాద?

Published Sat, Aug 4 2018 9:27 AM | Last Updated on Sat, Aug 4 2018 9:27 AM

Rai Laxmi React on casting couch - Sakshi

తమిళసినిమా: మహిళకెక్కడ మర్యాదు అంటూ మరోసారి వార్తల్లోకొచ్చింది సంచలన నటి రాయ్‌లక్ష్మి. అందాలారబోతలో గానీ, ప్రేమ వ్యవహారంలో గానీ ఈ బ్యూటీపై చాలా వదంతులే ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్‌కు వెళ్లి జూలీ–2 చిత్రంలో టూ పీస్‌ దుస్తులతో పెద్ద దుమారానికి తెరలేపిన రాయ్‌లక్ష్మీ ఇటీవల ఎక్కడా కనిపించలేదు. నటనపై కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్న ఈ అమ్మడు ఆ దిశగానే అవకాశాలను రాబట్టుకుంటోంది. ఐటమ్‌ సాంగ్స్‌లో నటించడానికి సై అనే రాయ్‌లక్ష్మి ఈ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైదీ నంబర్‌ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు పాటలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ  సంచలనాలకు రెడీ అయ్యింది.

చేతిలో చిత్రాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్‌లో నీయా 2, యాగం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇది ఈ అమ్మడికి ఒకరకంగా రీఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకుంటే కోలీవుడ్‌లో రాయ్‌లక్ష్మిని చూసి చాలా కాలమైంది. కాగా ఏ విషయానైన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే రాయ్‌లక్ష్మీని ఇటీవల దక్షిణాదిలో కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నించగా మీకో విషయం చెప్పాలి సినీరంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా మహిళలకు మర్యాదు తక్కువేనని చెప్పింది. ముఖ్యంగా పని కోసం కొత్తగా వచ్చే మహిళలు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారని అంది. ఇకపోతే కాస్టింగ్‌ కౌచ్‌ అన్నది తనకు ప్రత్యక్షంగా ఎదురవలేదని చెప్పింది. అయితే సినిమా రంగానికి కొత్తగా వచ్చే వారిని తక్కువ చేసి మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారని అంది. అది అత్యాచారం వంటి విషయాల్లోనే కాదు ఇంకా చాలా రకాలుగా బాధిస్తున్నారని రాయ్‌లక్ష్మి పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement