Rai laxmi
-
చీరలో రాయ్ లక్ష్మి, రాయల్ లుక్ అదుర్స్
-
చాలా రకాలుగా బాధిస్తున్నారు
తమిళసినిమా: మహిళకెక్కడ మర్యాదు అంటూ మరోసారి వార్తల్లోకొచ్చింది సంచలన నటి రాయ్‌లక్ష్మి. అందాలారబోతలో గానీ, ప్రేమ వ్యవహారంలో గానీ ఈ బ్యూటీపై చాలా వదంతులే ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్‌కు వెళ్లి జూలీ–2 చిత్రంలో టూ పీస్ దుస్తులతో పెద్ద దుమారానికి తెరలేపిన రాయ్‌లక్ష్మీ ఇటీవల ఎక్కడా కనిపించలేదు. నటనపై కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్న ఈ అమ్మడు ఆ దిశగానే అవకాశాలను రాబట్టుకుంటోంది. ఐటమ్ సాంగ్స్‌లో నటించడానికి సై అనే రాయ్‌లక్ష్మి ఈ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు పాటలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. చిన్న గ్యాప్ తరువాత మళ్లీ సంచలనాలకు రెడీ అయ్యింది. చేతిలో చిత్రాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్‌లో నీయా 2, యాగం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇది ఈ అమ్మడికి ఒకరకంగా రీఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకుంటే కోలీవుడ్‌లో రాయ్‌లక్ష్మిని చూసి చాలా కాలమైంది. కాగా ఏ విషయానైన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే రాయ్‌లక్ష్మీని ఇటీవల దక్షిణాదిలో కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నించగా మీకో విషయం చెప్పాలి సినీరంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా మహిళలకు మర్యాదు తక్కువేనని చెప్పింది. ముఖ్యంగా పని కోసం కొత్తగా వచ్చే మహిళలు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారని అంది. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ అన్నది తనకు ప్రత్యక్షంగా ఎదురవలేదని చెప్పింది. అయితే సినిమా రంగానికి కొత్తగా వచ్చే వారిని తక్కువ చేసి మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారని అంది. అది అత్యాచారం వంటి విషయాల్లోనే కాదు ఇంకా చాలా రకాలుగా బాధిస్తున్నారని రాయ్‌లక్ష్మి పేర్కొంది. -
చక్కర్లు కొట్టేస్తా
సెలబ్రిటీలు ఒక్క చోట కుదురుగా ఉండలేరు. షూటింగ్స్ నిమిత్తం దేశాలు పట్టుకు తిరుగుతుంటారు. రాయ్‌లక్ష్మీ ఐతే ఏకంగా వారానికి మించి ఒక దేశంలో ఉండను అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే దుబాయ్‌లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న ఈ భామ దుబాయ్ నుంచి ముంబై తిరుగుప్రయాణం అయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, యూరప్, మలేసియా చూట్టూ చక్కర్లు కొట్టనున్నారు. చివరిగా మలేసియా నుంచి మళ్లీ ముంబై చేరుకుంటారట రాయ్‌లక్ష్మీ. అలా షూటింగ్స్ నిమిత్తం నెక్ట్స్ కొన్ని రోజుల పాటు చుట్టేసేయ్ చుట్టేసేయ్ అంటూ పాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ మధ్య వరుసగా గ్లామర్ పాత్రల్లో కనిపిస్తున్న రాయ్‌లక్ష్మీ తన తదుపరి చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కర్రి బాలాజీ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి కూడా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. -
ప్రతిసారీ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని!
సాక్షి, చెన్నై : నేను ప్రేమలో ఎన్ని సార్లు ఓడిపోయానో తెలుసా? అంటోంది నటి రాయ్‌లక్ష్మీ. సంచలనాలకు కేంద్రబిందువుగా ముద్రపడిన ఈ బహుభాషా నటి తరచూ ఏదో ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం పుట్టిస్తూనే ఉంటుంది. కొన్నేళ్ల కిందట టీమిండియా క్రికెటర్ ధోనితో డేటింగ్ అంటూ రాయ్‌లక్ష్మీ గురించి హాట్ హాట్ ప్రచారం జరిగింది. తాజాగా హిందీ చిత్రం జూలీ-2 చిత్ర ట్రైలర్లో తన అందాలతో మరోసారి వార్తల్లో నానుతోంది. ఇటీవల నటి మరిన్ని విషయాలపై చర్చించారు. ‘జూలీ-2 చిత్రంలో నేను గ్లామరస్‌గా నటించాననే ప్రచారం జరుగుతోంది. చిత్ర ట్రైలర్‌ను చూసిన వారు అలా అనుకోవడంలో తప్పులేదు. అయితే చిత్రం పూర్తిగా చూసిన వారు నా పాత్రను చూసి అయ్యో పాపం అనుకుంటారు. అందులో నాన్న చనిపోతారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది. అమ్మ రెండో భర్త నన్ను బయటకి వెళ్లి సంపాదించుకురా అని తరిమేస్తాడు. అలా ఎంతో కష్టపడి పోరాడి నటిగా నిలదొక్కుకుంటున్నాను. సినీరంగంలో ఇటీవల అత్యాచారాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారని అయితే తనకలాంటి అనుభవం ఎదురు కాలేదు. తనను దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ కర్క కచడర చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేశారని, ఆ తరువాత అవకాశాలు లేక నాలుగేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు సెక్స్ సంబంధాల గురించి నర్మగర్భంగా అర్ధమైంది. అనుసరించి పోవాలని కొందరు చెప్పారు. అలా చేస్తే నేనిప్పుడు సూపర్ హీరోయిన్ అయ్యేదాన్ని. అప్పట్లో నాకు తమిళ భాషలో ఒక్క పదం కూడా తెలిసేది కాదు. కొందరు నాపై దుష్ప్రచారం చేసేవారు. ఇక ప్రేమలో నేను ఐదుసార్లు ఓడిపోయాను. అలా ఓడిన ప్రతిసారీ గదిలో కూర్చుని ఏడ్చేదాన్ని. మగవారిలో మంచివాళ్లు ఎక్కువే, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. నటుడు ఆర్య నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు మాత్రమే. నాకు రాజకీయాలు తెలియనందుకే ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదని’ తన మనసులో మాటను రాయ్‌లక్ష్మీ స్పష్టం చేసింది. -
మతిపోగొట్టేలా రాయ్‌లక్ష్మీ
చెన్నై : హిందీ చిత్రం జూలీ-2లో నటి రాయ్ లక్ష్మీ విజృంభణ ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న నటి రాయ్‌లక్ష్మీ. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంవంటి దక్షిణాది భాషల్లో 50పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఏ భాషలోనూ హీరోయిన్గా సరైన స్థాయికి చేరుకోలేకపోయింది. ఆ మధ్య తెలుగు చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో ‘బాసూ చూపించు నీ గ్రేస్ ..అంటూ ఐటమ్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నర్తించింది. అప్పటి నుంచి బాలీవుడ్లో అవకాశాల కోసం చూస్తోంది. ఎట్టకేలకు జూలీ -2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలయింది. అందులో రాయ్‌లక్ష్మీ కనిపించిన విధానం చూసి సినీ వర్గాలు విస్తుపోతున్నాయి. గ్లామర్ అనే పదానికి అర్ధాన్ని రాయ్‌లక్ష్మీ మార్చేసిందనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి.