చక్కర్లు కొట్టేస్తా | Julie 2 director vacationing in Dubai without paying technicians | Sakshi
Sakshi News home page

చక్కర్లు కొట్టేస్తా

Published Wed, Dec 27 2017 12:07 AM | Last Updated on Wed, Dec 27 2017 12:07 AM

Julie 2 director vacationing in Dubai without paying technicians - Sakshi

సెలబ్రిటీలు ఒక్క చోట కుదురుగా ఉండలేరు. షూటింగ్స్‌ నిమిత్తం దేశాలు పట్టుకు తిరుగుతుంటారు. రాయ్‌లక్ష్మీ ఐతే ఏకంగా వారానికి మించి ఒక దేశంలో ఉండను అంటున్నారు. మ్యాటర్‌ ఏంటంటే దుబాయ్‌లో క్రిస్మస్‌ సంబరాలు జరుపుకున్న ఈ భామ దుబాయ్‌ నుంచి ముంబై తిరుగుప్రయాణం అయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, యూరప్, మలేసియా చూట్టూ చక్కర్లు కొట్టనున్నారు.

చివరిగా మలేసియా నుంచి మళ్లీ ముంబై చేరుకుంటారట రాయ్‌లక్ష్మీ. అలా షూటింగ్స్‌ నిమిత్తం నెక్ట్స్‌ కొన్ని రోజుల పాటు చుట్టేసేయ్‌ చుట్టేసేయ్‌ అంటూ పాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ మధ్య వరుసగా గ్లామర్‌ పాత్రల్లో కనిపిస్తున్న రాయ్‌లక్ష్మీ తన తదుపరి చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. కర్రి బాలాజీ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి కూడా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement