నా సక్సెస్‌ భిన్నం బాస్‌ | Radhika Apte Says her Victory Different From Others | Sakshi
Sakshi News home page

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

Published Wed, Jun 19 2019 8:31 AM | Last Updated on Wed, Jun 19 2019 8:31 AM

Radhika Apte Says her Victory Different From Others - Sakshi

తన సక్సెస్‌ కాస్త భిన్నం అంటోంది నటి రాధికాఆప్తే. అవును ఈ అమ్మడు సహ నటీమణులకే భిన్నం అంటారు. ఇక భావాలు వేరేగా ఉండడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికి సిద్ధం అనే ఈ సంచలన భామ నటిగానూ ఎల్లలు దాటేసిందన్నది వాస్తవం. ధోనీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రాధికాఆప్తే, ఆ తరువాత కార్తీతో ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా, రజనీకాంత్‌ సరసన కబాలి వంటి చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులోనూ బాలకృష్ట స్టార్‌ హీరోలతో నటించిన రాధికాఆప్తే దక్షిణాదిలో పెద్దగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను పొందక పోయినా, బాలీవుడ్, హాలీవుడ్‌లలో నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది. ఇటీవల బ్రిటీష్, అమెరికా చిత్రంగా రూపొందిన ది వెడ్డింగ్‌ గెస్ట్‌లో నటించింది. ప్రస్తుతం మరో హాలీవుడ్‌ చిత్రం వరల్డ్‌వార్‌–2లో నటిస్తోంది.

కాగా ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్‌లోనూ నటిస్తున్నా ఇంకా తాను అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని రాధికాఆప్తేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించి ఈ మరాఠి అమ్మడు చెబుతూ తాను నటించిన హాలీవుడ్‌ చిత్రం ది వెడ్డింగ్‌ గెస్ట్‌ ఇటీవలే అమెరికాలో విడుదలైందని చెప్పింది. ఆ చిత్రం తరువాత ఇప్పుడు పలు హాలీవుడ్‌ చిత్రాల అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. వాటి స్క్రిప్ట్‌లను చదువుతున్నానని, కొత్త చిత్రంలో నటించే విషయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. తాను అన్ని భాషల్లోనూ ప్రముఖ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది. ఇతరులు దేన్ని విజయం అనుకుంటున్నారో, తాను భావించే విజయం దానికి భిన్నంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఇప్పటి వరకూ తనను తాను సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా భావించడం లేదని అంది. దాన్ని తానింకా సాధించలేదని, అందుకు సమయం వచ్చినప్పుడు తాను సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా భావిస్తానని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడికి దక్షిణాదిలో ప్రస్తుతం ఒక్క అవకాశం కూడా లేదన్నది వాస్తవం. వాటి కోసమే తరచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement