ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్‌ సినిమా. | Radhika Apte Movie Streaming In OTT After Five Years | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్‌ సినిమా... తెలుగులో స్ట్రీమింగ్‌

Published Mon, Apr 15 2024 11:31 AM | Last Updated on Sat, May 11 2024 12:22 PM

Radhika Apte Movie Streaming In OTT After Five Years - Sakshi

రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్‌ అడ్రస్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో పాపులర్‌ అయిన దేవ్ పటేల్‌తో ఈ చిత్రంలో మెప్పించింది. బ్రిటీష్-అమెరికన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. చివరకు ఓటీటీలో కూడా భారత్‌ యూజర్స్‌కు అందుబాటులో లేదు.

మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించిన 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తాజాగా నెట్‌ప్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్‌ భాషలలో విడుదలైంది. సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.

ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న సీన్ విడుదలకు ముందే లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై నటి రాధికా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా టాపిక్‌ ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయింది. ఈ సినిమాలో రాధికా ఆప్టే పూర్తిగా దుస్తులు తొలిగించిన సీన్స్‌ ఉండటంతో 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రం బాగా వైరల్‌ అయింది.

ఆ సీన్‌పై రాధికా ఆప్టే ఏమన్నారంటే
బోల్డ్ సీన్స్‌లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని  'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా విడుదల సమయంలో రాధికా తెలిపింది. ఈ సినిమా కోసం ఆమె దుస్తులు లేకుండా కనిపించింది. ఆ విషయం గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగడం. ఆపై విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని బోల్డ్‌ స్టేట్‌మెంట​్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement