బొద్దుగా ఉన్నానని వద్దన్నారు! | Radhika Apte Over Losing Vicky Donor Chance | Sakshi
Sakshi News home page

బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!

Jul 1 2019 8:34 AM | Updated on Jul 1 2019 8:34 AM

Radhika Apte Over Losing Vicky Donor Chance - Sakshi

సినిమాలోనే కాదు సినిమా పూర్తయి బయటకు రావడం వెనుక కూడా ఓ పెద్ద కథే ఉంటుంది. స్క్రిప్ట్‌ స్టేజ్‌లో అనుకున్న వాళ్లు స్క్రీన్‌ మీదకు వచ్చే సమయానికి ఉండకపోవచ్చు. అస్సలు అనుకోని వాళ్లు కూడా అనుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగమవచ్చు. ఇదంతా ఎందుకంటే బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘విక్కీ డోనర్‌’ సినిమాలో విచిత్రంగా అవకాశం కోల్పోయారట రాధికా ఆప్టే. ఈ విచిత్రమేంటో రాధికా ఆప్టే వివరిస్తూ – ‘‘విక్కీ డోనార్‌’ సినిమాలో హీరోయిన్‌గా ముందు నా పేరే అనుకున్నారు. ఆ సినిమా స్టార్ట్‌ అయ్యే కొన్ని రోజుల ముందు ఫారిన్‌కు హాలిడేకు వెళ్లాను. ఆ ట్రిప్‌లో నచ్చిన ఫుడ్‌ను కొంచెం ఇష్టాంగా తిన్నాను. దాంతో కాస్త బొద్దుగా అయ్యాను. లావయ్యానని మా టీమ్‌ కొంచెం అప్‌సెట్‌ అయ్యారు. తిరిగి వచ్చాక తగ్గిపోతాను అని చెప్పినా కూడా రిస్క్‌ చేయదలుచుకోలేదు. అలా ఆ సినిమా ఛాన్స్‌ మిస్‌ అయింది’’ అని చెప్పారు ఆప్టే. ఈ సినిమాలో హీరోయిన్‌గా యామీ గౌతమ్‌ నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement