
దక్షిణాదిపై ఆరోపణల పర్వం
నటి తాప్సీ ఆరోపణల స్వరం పెంచింది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై ధ్వజమెత్తుతోంది.
నటి తాప్సీ ఆరోపణల స్వరం పెంచింది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై ధ్వజమెత్తుతోంది. హిందీలో ఒక విజయం లభించడంతో ఇక దక్షిణాది చిత్రాల అవకాశాలతో పనిలేదని భావిస్తోందో? ఏమో? గానీ చాలా ఘాటుగానే విమర్శలు గుప్పిస్తోంది. తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెడుతోంది కూడా. ఈ మధ్య కొందరు హీరోయిన్లు కోలీవుడ్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇలియానా, తాప్సీ లాంటి బాలీవుడ్ భామలకు తొలిరోజుల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమనే ఆదుకుంది.
అప్పుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలను సహించారు. అలాంటిది ఎప్పుడైతే సొంత గడ్డపై అవకాశాలను అందుకున్నారో అప్పటి నుంచి దక్షిణాదిపై దండెత్తడానికి రెడీ అవుతున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల కబాలి ఫేమ్ రాధిక ఆప్తే దక్షిణాది నటుడొకరు తాను బస చేసిన హోటల్ గదికి ఫోన్ చేసి తన గదికి రమ్మని వత్తిడి చేశాడని ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. అదే విధంగా విద్యాబాలన్ ఆరంభంలో ఒకరు తనను అవమాన పరచినట్లు వెల్లడించి వార్తల్లోకెక్కింది. ఇక తాజాగా పింక్ చిత్రం విజయంతో బాలీవుడ్‌లో ప్రచారాన్ని వెతుక్కుంటున్న తాప్సీ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణల దాడి చేస్తోంది.
ఆరంభంలో ఆదుకున్న వారని కూడా ఆలోచించకుండా దక్షిణాది చిత్రపరిశ్రమలో తోలి రోజుల్లో తగిన మర్యాదను పొందకుండా అవమానాలకు గురయ్యానని, తన సంభాషణల వాచకం సరిగా లేదని కొందరు నటులు కించపరచారని ఆరోపణలు చేసింది. అంతే కాదు పారితోషికం విషయంలోనూ చాలా మోసమైన సంఘటనలను ఎదుర్కొన్నానని వాపోయింది. తనకు ఇచ్చిన చాలా చెక్కులు బౌన్సు అయ్యాయని తెలి పింది. నటులు మాత్రం తమ పారి తోషికాలను కరెక్ట్‌గా తీసుకునే వారని సహ నటులను వదల కుండా దులిపేసింది.