
‘జాగ్రత్త మేడమ్. జాగ్రత్తలు పాటించండి’ అంటూ రాధికా ఆప్టే అభిమానులు ట్వీటర్ ద్వారా ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. అసలు విషయం ఏంటంటే... తన తాజా సినిమా చిత్రీకరణ నిలిచిపోవడంతో లండన్‌లో ఉంటున్న భర్త బెనెడిక్ట్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్లారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో చర్చకు దారి తీసింది. ముఖానికి మాస్క్ ధరించి ఆస్పత్రిలో వేచి చూస్తున్న తన ఫొటోని పోస్ట్ చేసి, ‘‘ఆస్పత్రికి వచ్చాను.. అయితే భయపడాల్సిందేమీ లేదు. కోవిడ్ 19 గురించి కాదులెండి. అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు. కరోనా గురించి కాకపోయినా ఆస్పత్రికి వెళ్లారు కాబట్టి వేరే ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి ఉంటుందని ఫాలోయర్స్ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment