లండన్: భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) ఇప్పుడు బ్రిటన్‌ను కలవరపెడుతోంది. ఆ దేశంలో ఈ వేరియంట్ వల్ల ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) పేర్కొంది. తాజాగా పీహెచ్‌ఈ అందించిన నివేదిక ప్రకారం డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్లు వారంలో 5,472కు పెరిగాయి.ఇప్పటివరకూ మొత్తం 12,200 కేసులు నమోదయ్యాయి.
ఈ డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో ఇప్పటికే ఉన్న ఆల్ఫా వేరియంట్‌ను అధిగమించే స్థాయికి చేరుకుందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ డెల్టా వేరియంట్ మొట్టమొదట ఇంగ్లండ్‌లోని కెంట్ రీజియన్‌లో బయటపడింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ వారం డెల్టా వేరియంట్‌తో 278 మంది అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరారు. గత వారం 201 మంది హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కాగా వీరిలో వ్యాక్సిన్ తీసుకోనివారు ఎక్కువగా ఉన్నారని.. వీలైనంత త్వరలో వీరందరికి వ్యాక్సిన్ వేయడానికి ప్రయత్నించాలి.
ఈ వేరియంట్ ఇప్పుడు బ్రిటన్ అంతటా వ్యాపిస్తోందని... మనమందరం వీలైనంత జాగ్రత్త వహించడం చాలా అవసరమని యూకే ఆరోగ్య భద్రతా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హారిస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఈ వేరియంట్‌తో ఎంతమంది ప్రాణాలు కోల్పోవచ్చు అన్న విషయంపై క్లారిటీ లేదు. కాగా ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్‌తో ప్రమాదం ఎక్కువగా ఉందని పీహెచ్‌ఈ హెచ్చరించింది. పీహెచ్‌ఈ అందించిన నివేదిక ఆధారంగా అధికారులు అప్రమత్తమయ్యారు.
చదవండి: Covid: అమెరికా నుంచే వ్యాప్తి.. చైనా సవాల్
Comments
Please login to add a commentAdd a comment