
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంతో తమిళ తంబీలను అమితంగా ఆకట్టుకున్న బ్యూటీ రాధికా ఆప్టే. ఎంతటి స్థాయికైనా అందాలను ఆరబోయడానికి వెనుకాడని ఈ గుమ్మ డాన్స్‌కు మాత్రమే కాకుండా కథా పాత్రలో ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తుంది. అసలు విషయానికి వస్తే ఆ మధ్య రాధికా ఆప్టే స్నానం చేస్తూ తీసుకున్న సెల్ఫీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అమ్మడు అందాలను చూసిన కుర్రకారుకు దిమ్మతిరిపోయింది. అయితే ఆమె మాత్రం ఆ సెల్ఫీల్లో ఉన్నది తాను కాదని సింపుల్‌గా చెప్పేసింది.
ఇదిలా ఉంటే తాజాగా రాధికా ఆప్టే మరో సెల్ఫీ విడుదలైంది. ఇందులో ఒక బల్లిని చెంపపై పెట్టుకున్న బ్యూటీ దాన్ని నాలుకతో తాకడానికి ట్రై చేస్తున్నట్టుంది. ఈ జుగుప్సాకరమైన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ బల్లి నిజమైందా? కాదా అనే విషయం తెలియడం లేదు.