దూకుడు పెంచిన కీర్తిసురేష్‌ | Keerthy Suresh Announced Akka Web Series | Sakshi
Sakshi News home page

దూకుడు పెంచిన కీర్తిసురేష్‌

Published Thu, Nov 30 2023 10:24 AM | Last Updated on Thu, Nov 30 2023 10:36 AM

Keerthy Suresh Announced Akka Web Series - Sakshi

నటి కీర్తిసురేష్‌ దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ కేరళ బ్యూటీ ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో సతమతం అయిన కీర్తిసురేష్‌కు తెలుగులో నాని సరసన నటించిన దసరా చిత్రం మళ్లీ విజయపథం వైపు మళ్లించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన మామన్నన్‌ చిత్రం కూడా మంచి విజయాన్ని అందించింది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది.

ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటిలో జయంరవి సరసన నటిస్తున్న సైరన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కాకుండా రఘుదాదా, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది. కాగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ హిందీలో నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మరో హిందీ వెబ్‌ సీరీస్‌లో కూడా ఈ బ్యూటీ నటించడం విశేషం. ఈమె నటిస్తున్న తొలి వెబ్‌ సీరీస్‌ ఇదే అన్నది గమనార్హం.

'అక్కా' అనే పేరు నిర్ణయించిన ఈ వెబ్‌ సీరీస్‌లో బోల్డ్‌ నటి రాధికాఆప్టే కూడా నటించడం విశేషం. కాగా వెబ్‌సీరీస్‌కు సెన్సార్‌ సమస్య లేకపోవడంతో గ్లామర్‌ సన్నివేశాలు అధికంగా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇంతకుముందు కథానాయి కలు తమన్నా, సమంత వెబ్‌సీరీస్‌లో చాలా బోల్డ్‌గా నటించి ఉచిత ప్రచారం పొందిన విషయం తెలిసిందే. దీంతో కీర్తిసురేష్‌, రాధికాఆప్టే కలిసి నటిస్తున్న 'అక్కా' వెబ్‌ సీరీస్‌లో కూడా గ్లామరస్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే భావన వీరి అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement