Radhika Apte Opens Up About Facing Body Shaming - Sakshi
Sakshi News home page

Radhika Apte: నీ ముక్కు సరిగా లేదంటూ ఎగతాళి చేశారు: రాధికా ఆప్టే

Published Thu, Apr 13 2023 7:17 PM | Last Updated on Fri, Apr 14 2023 5:24 PM

Radhika Apte About Body Shaming - Sakshi

నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్‌ రాధికా ఆప్టే ఒకరు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసిన ఆమె కెరీర్‌ తొలినాళ్లలో తిరస్కరణకు గురైంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది.

రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'మొదట్లో నన్ను అంతా పల్లెటూరి అమ్మాయిలాగే భావించారు. కానీ బద్లాపూర్‌ సినిమాతో వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేశాను. కానీ ఈ సినిమాతో నేను హాట్‌ డోస్‌ కామెడీ సినిమాలు మాత్రమే చేస్తానని భావించారు. దీంతో అలాంటి కథలకు ఓకే చెప్పడం మానేశా. కేవలం మూడు, నాలుగు కిలోల ఎక్కువ బరువున్నానని నన్ను ఓ సినిమా నుంచి తీసేశారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఇలా చాలా జరుగుతాయి. నీ ముక్కు సరిగా లేదు, బ్రెస్ట్‌ సైజు పెద్దగా లేదు. ముందు వాటిని సరిచేసుకోవచ్చు కదా? అనేవారు. ఇలా చాలానే ఫేస్‌ చేశాను' అని చెప్పుకొచ్చింది.

కాగా రాధికా ఆప్టే.. వాహ్‌, లైఫ్‌ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. రక్త చరిత్రతో తెలుగులో, ధోని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్‌ సరసన కబాలి సినిమాలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్‌ చిత్రాల్లో అనేక భాషలు చేసింది నటి. ప్రస్తుతం ఆమె నటించిన మిసెస్‌ అండర్‌ కవర్‌ ఏప్రిల్‌ 14 నుంచి జీ5లో ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement