ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో 30/30! | 30/30 in Inter practical | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో 30/30!

Published Mon, Feb 20 2017 2:34 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో 30/30! - Sakshi

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో 30/30!

యాజమాన్యాలతో ఎగ్జామినర్ల కుమ్మక్కు..
ఇష్టారాజ్యంగా మార్కులు.. పట్టించుకోని ఇంటర్‌ బోర్డు


సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో సీసీ కెమరాల్లేవు.. నిఘా లేదు. పరీక్ష కేంద్రాల జంబ్లింగ్‌ అంతకంటే లేదు. ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌. దీంతో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎగ్జామినర్లకు ముడుపులిచ్చి తమ విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయించుకున్నట్లు విమర్శలు వస్తు న్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే ఒక్కో గ్రూపులోని ఒక్కో బ్యాచ్‌లో ఉండే 20 మంది విద్యార్థుల్లో ఒక్కరికి మించి 30కి 30 మార్కులు వేయకూడదన్న నిబంధనను తుంగలో తొక్కి ఎగ్జామినర్లు ఇష్టానుసారం మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు ఆలసత్వ వైఖరి కూడా దీనికి కార ణమవుతోంది. ముడుపుల మత్తులో జోగుతూ పట్టించుకోని కొంతమంది బోర్డు అధికారులు, యాజమాన్యాలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తున్న కొంతమంది ఎగ్జామినర్ల తీరుతో ఈ పరీక్షలకు విలువ లేకుండా పోయింది.

రెండు రోజుల కిందట: రెండు రోజుల కిందట ఓ ఎగ్జామినర్‌కు ఓ కార్పొరేట్‌ కాలేజీలో డ్యూటీ పడింది. సదరు కాలేజీకి వెళ్లాక.. ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు కలిపి రూ.30వేలు ఇస్తామని యాజమాన్యం ఆయనతో ‘ఒప్పందం’ కుదుర్చుకుంది. దీంతో ఆ ఎగ్జామినర్‌ ఎక్కువ మంది విద్యార్థులకు 30కి 30 మార్కులను వేసేశారు. చివరకు సదరు ఎగ్జామినర్‌కు రూ.6 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపింది ఆ యాజమాన్యం. మరోవైపు ఎగ్జామినర్‌ను మేనేజ్‌ చేయాలంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు యాజమాన్యం వసూలు చేసింది. అయితే అదే ఎగ్జామినర్‌కు అదే కాలేజీలో ఆదివారం కూడా డ్యూటీ పడింది. ఇంకేముంది అదనపు మొత్తం కావాలని డిమాండ్‌ చేశారు సదరు ఎగ్జామినర్‌. మధ్యేమార్గంగా ఒప్పందం చేసుకుని.. అత్యధిక మార్కులు వేసేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా.. అది కార్పొరేట్‌ యాజమాన్యం కావడంతో చేతులెత్తేశారు. ఆ ఒక్క కాలేజీలోనే కాదు.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలన్నింటిలోనూ ఈ దందా కొనసాగుతోంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ర్యాంకుల ఖరారులో ఒక్క మార్కు కూడా కీలకం అవుతోంది.

సీసీ కెమెరాల్లేవ్‌.. జంబ్లింగ్‌పై దృష్టి లేదు: రాష్ట్రవ్యాప్తంగా 1,682 కాలేజీల్లో 3,19,185 విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహణకు ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్స్‌ జరిగే ఒక్కో గదిలో 2 చొప్పున సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని, నిఘా నీడన పరీక్ష నిర్వహిస్తామని మొదట్లో పేర్కొంది. కానీ ప్రాక్టికల్స్‌ ప్రారంభమయ్యే సమయానికి సీసీ కెమెరాలు కచ్చితంగా ఉండాలనే నిబంధనను తొలగించింది. అలాగే పరీ„ýక్ష కేంద్రాల జంబ్లింగ్‌నూ పట్టించుకోలేదు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే పరీక్ష కేంద్రాలు పడటంతో ఇష్టారాజ్య మార్కులకు తెరలేచింది. మరోవైపు ఒక్కో కేంద్రంలో ఒక్కో గ్రూపులో ప్రాక్టికల్స్‌ జరిగే బ్యాచ్‌లోని 20 మందిలో ఒక్కరికి మించి 30 మార్కులకు 30 వేయరాదన్న నిబంధన అమలును బోర్డు పట్టించుకోవడం లేదు. ఏటా ఒక్కో బ్యాచ్‌లో ఆరేడు మందికి 30కి 30 వేసిన సందర్భాలున్నా.. ఎగ్జామినర్లపై చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement