Inter practical
-
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 30/30!
⇒ యాజమాన్యాలతో ఎగ్జామినర్ల కుమ్మక్కు.. ⇒ ఇష్టారాజ్యంగా మార్కులు.. పట్టించుకోని ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో సీసీ కెమరాల్లేవు.. నిఘా లేదు. పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ అంతకంటే లేదు. ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్. దీంతో కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎగ్జామినర్లకు ముడుపులిచ్చి తమ విద్యార్థులకు 30కి 30 మార్కులు వేయించుకున్నట్లు విమర్శలు వస్తు న్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ఒక్కో గ్రూపులోని ఒక్కో బ్యాచ్‌లో ఉండే 20 మంది విద్యార్థుల్లో ఒక్కరికి మించి 30కి 30 మార్కులు వేయకూడదన్న నిబంధనను తుంగలో తొక్కి ఎగ్జామినర్లు ఇష్టానుసారం మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఆలసత్వ వైఖరి కూడా దీనికి కార ణమవుతోంది. ముడుపుల మత్తులో జోగుతూ పట్టించుకోని కొంతమంది బోర్డు అధికారులు, యాజమాన్యాలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తున్న కొంతమంది ఎగ్జామినర్ల తీరుతో ఈ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. రెండు రోజుల కిందట: రెండు రోజుల కిందట ఓ ఎగ్జామినర్‌కు ఓ కార్పొరేట్ కాలేజీలో డ్యూటీ పడింది. సదరు కాలేజీకి వెళ్లాక.. ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు కలిపి రూ.30వేలు ఇస్తామని యాజమాన్యం ఆయనతో ‘ఒప్పందం’ కుదుర్చుకుంది. దీంతో ఆ ఎగ్జామినర్ ఎక్కువ మంది విద్యార్థులకు 30కి 30 మార్కులను వేసేశారు. చివరకు సదరు ఎగ్జామినర్‌కు రూ.6 వేలు మాత్రమే చేతిలో పెట్టి పంపింది ఆ యాజమాన్యం. మరోవైపు ఎగ్జామినర్‌ను మేనేజ్ చేయాలంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు యాజమాన్యం వసూలు చేసింది. అయితే అదే ఎగ్జామినర్‌కు అదే కాలేజీలో ఆదివారం కూడా డ్యూటీ పడింది. ఇంకేముంది అదనపు మొత్తం కావాలని డిమాండ్ చేశారు సదరు ఎగ్జామినర్. మధ్యేమార్గంగా ఒప్పందం చేసుకుని.. అత్యధిక మార్కులు వేసేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా.. అది కార్పొరేట్ యాజమాన్యం కావడంతో చేతులెత్తేశారు. ఆ ఒక్క కాలేజీలోనే కాదు.. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలన్నింటిలోనూ ఈ దందా కొనసాగుతోంది. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ర్యాంకుల ఖరారులో ఒక్క మార్కు కూడా కీలకం అవుతోంది. సీసీ కెమెరాల్లేవ్.. జంబ్లింగ్‌పై దృష్టి లేదు: రాష్ట్రవ్యాప్తంగా 1,682 కాలేజీల్లో 3,19,185 విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్స్ జరిగే ఒక్కో గదిలో 2 చొప్పున సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని, నిఘా నీడన పరీక్ష నిర్వహిస్తామని మొదట్లో పేర్కొంది. కానీ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యే సమయానికి సీసీ కెమెరాలు కచ్చితంగా ఉండాలనే నిబంధనను తొలగించింది. అలాగే పరీ„ýక్ష కేంద్రాల జంబ్లింగ్నూ పట్టించుకోలేదు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే పరీక్ష కేంద్రాలు పడటంతో ఇష్టారాజ్య మార్కులకు తెరలేచింది. మరోవైపు ఒక్కో కేంద్రంలో ఒక్కో గ్రూపులో ప్రాక్టికల్స్ జరిగే బ్యాచ్‌లోని 20 మందిలో ఒక్కరికి మించి 30 మార్కులకు 30 వేయరాదన్న నిబంధన అమలును బోర్డు పట్టించుకోవడం లేదు. ఏటా ఒక్కో బ్యాచ్‌లో ఆరేడు మందికి 30కి 30 వేసిన సందర్భాలున్నా.. ఎగ్జామినర్లపై చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
22వ తేదీ వరకు నాలుగు దశలుగా నిర్వహణ తుస్సుమన్న సీసీ కెమెరాల నిబంధన, పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన బోర్డు? సాక్షి, హైదరాబాద్: ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా, పకడ్బందీగా జంబ్లింగ్ విధా నం అమలు చేస్తామంటూ ఊదరగొట్టిన ఇంటర్మీ డియెట్ బోర్డు చివరకు చేతులెత్తేసింది! కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి మొదట్లో రూపొందించిన నిబంధనలను పక్కన పెట్టే సింది!! సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్స్‌కు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్న నిబంధనను తొలగించి నేటి నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టి కల్స్కు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ల్యాబ్ సదుపాయాలు పెద్దగా లేని కొన్ని కాలేజీలు మినహా మిగతా కాలేజీల విద్యార్థులు దాదాపుగా తమ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపి స్తామన్న ఒక్క నిబంధన అమలుతో ప్రాక్టికల్స్ నిర్వహణకు సిద్ధమైంది. ప్రైవేటు యాజమాన్యా లు, ఓ మంత్రి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే బోర్డు జంబ్లింగ్‌ను, సీసీ కెమెరాలు ఉండాలన్న నిబంధనలను తొలగించినట్లు విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉండాలంటూ పెట్టిన నిబంధననూ తొలగించాలంటూ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. పరీక్షలు ప్రారంభమైతే ఈ నిబం ధన విషయంలో ఏం చేస్తుందనేది తెలియనుంది. నాలుగు దశల్లో 22 వరకు నిర్వహణ ఇంటర్ ప్రాక్టికల్స్‌ను బోర్డు ఈ నెల 3 నుంచి 22 వరకు 4 దశలుగా నిర్వహించనుంది. దీని కోసం 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, వొకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్‌కు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలే జీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ విద్యా ర్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 39,044 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది. ఆన్లైన్లో ప్రశ్నపత్రం... ఆన్లైన్ ద్వారా ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. tsbie.cgg.gov.in నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. పరీక్ష పూర్తి కాగానే మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లాలో ఫిబ్రవరి 4 నుంచి జరిగిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీ క్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 117 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నామని జిల్లా అధికారులు చెప్పినా రికార్డు స్థారుులో మొత్తం 155 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించడం గమనార్హం. నాలుగు విడతలగా జరిగిన ఈ ప్రాక్టికల్స్‌కు ఎంపీసీ, బైపీసీ, బ్యాక్లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 17506 మంది హాజరుకావాల్సి ఉంది. అయితే 1636 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో తొలి విడతగా 34 కేంద్రాల్లో జరిగిన ప్రాక్టికల్స్‌కు 452 మంది గైర్హాజరు కాగా.. రెండో విడత 33 కేంద్రాల్లో 365 మంది, మూడో విడత 42 కేంద్రాల్లో 581మంది, నాల్గవ, ఆఖరి విడత 46 కేంద్రాల్లో 238 మంది డుమ్మా కొట్టినట్లు అధికారికంగా వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రంగాం ఊపిరిపీల్చుకుంది. నామమాత్రపు తనిఖీలే... ప్రాక్టికల్ పరీక్షలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు బోర్డుతో పాటు జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కానీ నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టేశారు. ఆర్ఐవో పాపారావుతో పాటు హైపవర్ కమిటీ సభ్యులు బొడ్డేపల్లి మల్లేశ్వరరావు, డీఈసీ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాధరావులతో పాటు డీవీఈవో ఆర్.పున్నయ్య కూడా తనిఖీలను నిర్వహించారు. మరో 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరోక ప్రత్యేక పరిశీలకుడు సైతం ఆరోపణలున్న కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందినంత దండుకున్నారు.. ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతో పాటు పాత పద్ధతి(నాన్‌జంబ్లింగ్)లోనే ప్రాక్టికల్స్ జరగడంతో శతశాతం మార్కులకు కార్పొరేట్‌తో పాటు ప్రైవేటు కళాశాలలు, ఇటు ప్రభుత్వ కళాశాలలు సైతం వెంపర్లాడాయి. ప్రభుత్వ కళాశాలల సంగతి కాసేపు పక్కనెడితే కార్పొరేట్, ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అందినంత దోచేశారు. డిపార్ట్మెంటల్ అధికారులు, ఎగ్జామినర్లుకు భారీగా ఆఫర్లు తీర్చారు. తనిఖీలకొచ్చిన అధికారులకు సైతం జేబులు నింపారు. అందరి సహకరాంతోనే.. ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం గా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, లోసుగులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాం. హైపవర్, డీఈసీ కమిటీ, సిబ్బంది, ప్రిన్సిపాళ్లు అందరూ సహకరించడంతో విజయవంతంగా పూర్తి చేశామని సాక్షికి చెప్పారు. కాగా మంగళవారం జరిగిన ప్రాక్టికల్స్‌కు ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆయన ధృవీకరించారు. - పాత్రుని పాపారావు,ఆర్ఐవో -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల తీరు ఇది
కనీస వసతులు లేకపోవడంతో ఇంటర్ విద్యార్థినులు ప్రాక్టికల్ పరీక్షలు చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం ఉదయం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బోటనీ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పీ బంగ్లా వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ల్యాబ్‌లు లేకపోవడంతో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ల్యాబ్‌లు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో టేబుళ్లు వేసి మొక్కుబడిగా ప్రాక్టికల్స్ నిర్లహిస్తున్నారు. కళాశాలల్లో ప్రాక్టికల్స్ చేయించకపోవడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ విద్యార్థినుల జీవితాలతో చెలాగటమాడుతున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. -
‘ప్రాక్టికల్స్’పై గందరగోళం
♦ నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ♦ సీనియర్లను వదిలి జూనియర్లకే ఎగ్జామినర్లుగా విధులు ♦ ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారన్న ఆందోళన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్లు గందరగోళంగా మారాయి. 1,322 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3,08,091 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల ప్రాక్టికల్స్‌ను పరిశీలించి మార్కులు వేసే ఎగ్జామినర్ల ఎంపిక అస్తవ్యస్తంగా తయారైంది. లోపాలను సరిదిద్దేందుకు ఈసారి మూడంచెల ఆన్లైన్ పరిశీలన విధానాన్ని అమల్లోకి తె చ్చినా అన్ని స్థాయిల్లో అధికారుల నిర్లక్ష్యం ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. సీనియర్ లెక్చరర్లను వదిలేసి జూనియర్లకు ఎగ్జామినర్లుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అవగాహన లేక ఇష్టారాజ్యంగా మార్కులు వేస్తారని... విద్యార్థులకు అన్యా యం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన లెక్చరర్లలో చాలామందికి అసలు ప్రాక్టికల్ పరీక్షల డ్యూటీలే వేయకపోవడం గమనార్హం. మొత్తంగా 15వేల మంది ఎగ్జామిన ర్లు, ఇన్విజిలేటర్లను నియమించినా.. అందులో చాలామంది జూనియర్లే ఉన్నారు. కొత్త విధానం ఎందుకంటే ప్రాక్టికల్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా, ఎగ్జామినర్లుగా అర్హతలు లేని వారు కూడా వస్తుండడంతో... ఈసారి ఇంటర్ బోర్డు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఆదేశించింది. కళాశాల ప్రిన్సిపల్ స్థాయిలో, రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) స్థాయి లో, ఇంటర్ బోర్డు స్థాయిలో ఈ పరిశీలన ఉండాలని స్పష్టం చేసింది. కానీ కాలేజీల స్థాయిలో పరిశీలన జరిగినా... తమ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్ల వివరాలు ఎవరెవరికి అప్లోడ్ అయ్యాయన్నది సరిచూసుకోలేదు. మరోవైపు ఆర్ఐవో స్థాయిలోనూ పరిశీలన జరగలేదు. ఇక ఏ కాలేజీలో ఎంత మంది లెక్చరర్లు ఉన్నారు, ఎంతమందికి ఎగ్జామినర్లుగా డ్యూటీ లు వేశారన్న దానిని బోర్డు పట్టించుకోలేదు. ఫలితంగా వేల మంది సీనియర్ లెక్చరర్ల వివరాలు అప్లోడ్ కాలేదు. దీంతో వారెవరికీ పరీక్షల డ్యూటీల కేటాయింపు జరగలేదు. ప్రైవేటు కాలేజీల్లో జరిగే ప్రాక్టికల్స్‌కు ఎగ్జామినర్లుగా వెళ్లే జూనియర్లను యాజమాన్యాలు మేనేజ్ చేసే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక నల్లగొండ బాలికల జూనియర్ కాలేజీ, ఖిలా వరంగల్, జనగాం, కౌటాల, శంషాబాద్, చేవెళ్ల, కోదాడ, బొమ్మల రామారం... ఇలా చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు చెందిన లెక్చరర్లకు ఎగ్జామినర్లుగా విధుల కేటాయింపు జరుగలేదు. -
జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ.. రోడ్డెక్కిన విద్యార్థులు
ఇంటర్ ప్రాక్టికల్స్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు సోమవారం తరగతులను బహిష్కరించి బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మహత్మాగాంధి విగ్రహానికి వినతిపత్రం అందించారు. -
జరిగేది జంబ్లింగే!
స్పష్టతనివ్వడంతో ఏర్పాట్లలో జిల్లా అధికారులు 64 కేంద్రాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలు సగం ప్రైవేట్ కళాశాలల్లోనే ప్రయోగ పరికరాలు హాజరుకానున్న 33,742 మంది విద్యార్థులు తనిఖీలకు నాలుగు స్క్వాడ్లు విశాఖపట్నం: ఈసారైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ ఉంటుందా.. ఉండదా.. అన్న సందేహాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఫిబ్రవరిలో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా జంబ్లింగ్ విధానం ప్రవేశపెడతామని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు సమీపించే సమయానికి వెనక్కు తగ్గడం అలవాటుగా మారింది. ఈ ఏడాది తప్పనిసరిగా జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. ఇంతలో ప్రయోగ పరీక్షలకు అవసరమైన పరికరాల కొరత ఉందన్న అంశాన్ని ప్రైవేటు కాలేజీలు తెరపైకి తెచ్చాయి. దీంతో జంబ్లింగ్ అమలుపై నీలినీడలు అలముకున్నాయి. ఒకపక్క ప్రయోగ పరీక్షలుంటాయని అధికారులు, ఉండకపోవచ్చని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానాన్ని ఖరారు చేస్తూ మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనర్, కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ తనిఖీ అధికారుల (ఆర్‌ఐఓల)తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జంబ్లింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విధివిధానాలను సూచించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్ఐవో తమర్బ నగేష్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం తన కార్యాలయంలో సమావేశమాయ్యరు. 64 కేంద్రాల ఎంపిక ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం విశాఖ జిల్లా, నగరంలో మొత్తం 64 కేంద్రాల ను ఎంపిక చేశారు. వీటిలో 23 ప్రభుత్వ, 11 ఎయిడెడ్, మూడు సాంఘిక సంక్షేమ, రెండు గిరిజన సంక్షేమ కళాశాలలు, 24 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 33,742 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల తనిఖీలు, పర్యవేక్షణకు నాలుగు స్క్వాడ్లను నియమిస్తున్నారు. -
జంబ్లింగ్ వద్దే వద్దు!
రాష్ర్ట ప్రభుత్వ చర్యలపై భగ్గుమన్న విద్యార్థిలోకం ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానంపై నిరసన జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిన రహదారులు మంగళగిరిలో విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం నరసరావుపేట ఆర్డీవో కార్యలయం ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని దయారత్నం కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ విధానం రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినుకొండలో స్తంభించిన ట్రాఫిక్.. వినుకొండ పట్టణంలో ప్రైవేటు కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కొద్దిసేపు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలకు లేని విధానం కేవలం ప్రైవేటు విద్యార్థులపై రుద్దటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కృష్ణవేణి, వాణి, గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్లో ధర్నా.. పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ప్రైవేట్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యార్థి జేఏసీ స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టిల్స్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎత్తివేయాలని డి మాండ్ చేశారు. పట్టణంలోని తొమ్మిది ప్రైవేట్ కాలేజీలకు చెందిన సుమారు వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. కొద్దిసేపటికి పోలీసులు విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. మాచర్లలో ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కార్యక్రమంలో కృష్ణవేణి, పల్నాడు, జయభారత్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, యాజమాన్యం పాల్గొన్నారు. మంగళగిరిలో పోలీసుల అత్యుత్సాహం జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థి సంఘాలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటన సోమవారం మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్లో చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, యాజమాన్యాలు మంగళగిరిలో ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల వ్యవహార శైలిపై కళాశాల యాజమాన్యాలు, విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహ ం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్, ఐఐటీలలో లేని జంబ్లింగ్ విధానం ఇంటర్లో ప్రవేశపెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేయగా అదేమంత్రి వర్గంలో ఉన్న నేటి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి ఆ విధానం ప్రవేశపెట్టడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జ్యోతి, పవన్, పులిపాక ఐజాక్, శ్యామ్, అభిషిత్, కిషోర్, నవీన్, భాషా తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జంబ్లింగ్ లేకుండానే నిర్వహణ బోర్డు పాలక మండలి సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డు పాలక మండలి సమావేశం సోమవారం బోర్డు కార్యాలయంలో జరిగింది. బోర్డు చైర్మన్‌గా జగదీశ్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మార్చి 9 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్‌పరీక్షల ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్షించారు. నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రాక్టికల్స్ నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాల జంబ్లింగ్ లేకుండానే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇన్విజిలేటర్లుగా ఇతర శాఖల నుంచి ఉద్యోగులను కూడా తీసుకునే అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రాక్టికల్స్ కోసం 1,356 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాత పరీక్షలకు 1,250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,67,329 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,99,287 మంది విద్యార్థులు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లించిన ట్లు మంత్రి తెలిపారు. కాగా, ఎంసెట్ నిర్వహణ విషయంలో విభజనచట్టం ప్రకారమే ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్, కన్సల్టెంట్ వీరభద్రయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్ష లు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి విడతగా నిర్వహిస్తున్న 26 కేంద్రాల్లో తొలిరోజు ప్రాక్టికల్స్‌కు 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. అయితే మౌలిక సదుపాయలు లేక కొన్ని సెంటర్లలో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. కొన్ని ప్రత్యేక రూట్లలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు నిర్ణీత వేళకు రాకపోవడంతో తిప్పలు తప్పలేదు. చేసేదేమీలేక...నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరాలనే ఆతృతతో ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. బోర్డు పరిశీలకుని ఆకస్మిక తనిఖీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఇంటర్ బోర్డు పరిశీలకుడు ఉపేందర్‌రెడ్డి స్థానికంగా ఉన్న కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి, సాయికృష్ణ, చైతన్య సహకార జూనియర్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు చేసి.. ఏర్పాట్లతీరుపై అసహనం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు సరిగాలేకుంటే కేంద్రాలను రద్దు చేస్తామని సీఎస్‌లను హెచ్చరించారు. ఆయన వెంట డీఈసీ కమిటీ సభ్యుడు జి.అప్పలనాయుడు ఉన్నారు. డీఈసీ కన్వీనర్, ఆర్ఐఓ ఎ.అన్నమ్మ రణస్థలం, పైడిభీమవరం, నరసన్నపేట కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా వేసేందుకు నియమించిన రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు ఇచ్ఛాపురం, కవిటి, కోటబొమ్మాళి, టెక్కలి, పాలకొండ కేంద్రాలను తనిఖీ చేశారు. కానరాని సదుపాయాలు తొలివిడతగా పరీక్షలు ప్రారంభమైన 26 కేంద్రాల్లో 15 సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. శ్రీకాకుళంతోపాటు పాలకొండ, కవిటి, పలాస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్‌ల్లో నాణ్యమైన ఫర్నీచర్, వెలుతురు, సరిపడినంత ప్రాక్టికల్ పరికరాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని కేంద్రాల్లో కనీసం మంచినీటిని ఏర్పాటు చేయలేదు. తొలిరోజే ఎగ్జామినర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే విమర్శలు వచ్చాయి. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నాలుగు విడతలుగా సీనియర్ సైన్స్ విద్యార్థులకు లకు జిల్లా వ్యాప్తంగా 117 కేంద్రాల్లో జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని ఆయా కేంద్రాలకు చేరవేశారు. పరీక్షలకు 15,440 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 11474 మంది కాగా, బైపీసీ విద్యార్థులు 3966 మంది ఉన్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. తొలిరెండు విడతలు ప్రైవేటు కళాశాలల కేంద్రాల్లోనే ప్రాక్టికల్స్ జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీటితో పాటు ఆర్ఐఓ, డీఈసీ క్క్వాడ్, హైపవర్ కమిటీలను నియమించారు. గత మూడేళ్లగా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతో పాటు నాన్‌జంబ్లింగ్ పద్ధతిలోనే పరీక్షలు జరుగుతుండటంతో శతశాతం మార్కుల సాధనే లక్ష్యంగా ఆయూ కళాశాలలు ఎగ్జామినర్లు, ఇతర పర్యవేక్షణాధికారుల జేబులు నింపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏర్పాట్లపై సమీక్షిస్తున్న అధికారులు.. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో జిల్లా ఇంటర్మీడియెట్ యంత్రాంగం తలమునకలై ఉంది. ఆర్ఐవో, డీఈసీ కన్వీనర్ ఎ.అన్నమ్మ డీఈసీ కమిటీ సభ్యులు బి.యజ్ఞభూషణరావు, జి.అప్పలనాయుడు, ఆర్.భూషణరావు, హైపవర్ కమిటీ ఆర్.పుణ్యయ్య తదితరులతో సమీక్షించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు! నేటి నుంచి ప్రారంభమమ్యే ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను పక్కాగా నిర్వహించి జిల్లాకు పేరుతీసుకురావాలి. ఎలాంటి అక్రమాలు, వసూళ్లకు పాల్పడినా చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేపడతాం. - ఎ.అన్నమ్మ, ఆర్ఐవో, డీఈసీ కన్వీనర్