నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
22వ తేదీ వరకు నాలుగు దశలుగా నిర్వహణ
తుస్సుమన్న సీసీ కెమెరాల నిబంధన, పరీక్ష కేంద్రాల జంబ్లింగ్
ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన బోర్డు?
సాక్షి, హైదరాబాద్: ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా, పకడ్బందీగా జంబ్లింగ్ విధా నం అమలు చేస్తామంటూ ఊదరగొట్టిన ఇంటర్మీ డియెట్ బోర్డు చివరకు చేతులెత్తేసింది! కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి మొదట్లో రూపొందించిన నిబంధనలను పక్కన పెట్టే సింది!! సీసీ కెమెరాలు ఉంటేనే ప్రాక్టికల్స్‌కు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామన్న నిబంధనను తొలగించి నేటి నుంచి జరగనున్న ఇంటర్ ప్రాక్టి కల్స్‌కు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ల్యాబ్ సదుపాయాలు పెద్దగా లేని కొన్ని కాలేజీలు మినహా మిగతా కాలేజీల విద్యార్థులు దాదాపుగా తమ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపి స్తామన్న ఒక్క నిబంధన అమలుతో ప్రాక్టికల్స్ నిర్వహణకు సిద్ధమైంది. ప్రైవేటు యాజమాన్యా లు, ఓ మంత్రి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే బోర్డు జంబ్లింగ్‌ను, సీసీ కెమెరాలు ఉండాలన్న నిబంధనలను తొలగించినట్లు విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లోని పరీక్ష కేంద్రాల్లో అబ్జర్వర్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఉండాలంటూ పెట్టిన నిబంధననూ తొలగించాలంటూ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. పరీక్షలు ప్రారంభమైతే ఈ నిబం ధన విషయంలో ఏం చేస్తుందనేది తెలియనుంది.
నాలుగు దశల్లో 22 వరకు నిర్వహణ
ఇంటర్ ప్రాక్టికల్స్‌ను బోర్డు ఈ నెల 3 నుంచి 22 వరకు 4 దశలుగా నిర్వహించనుంది. దీని కోసం 1,682 కేంద్రాలను (జనరల్ 1,373, వొకేషనల్ 309) ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్‌కు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలే జీలకు చెందిన 3,19,185 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ విద్యా ర్థులు 1,56,021 మంది, బీపీసీ విద్యార్థులు 91,687 మంది, జియోగ్రఫీ విద్యార్థులు 350 మంది, వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 39,044 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 32,083 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,248 మంది ఎగ్జామినర్లను ఇంటర్ బోర్డు నియమించింది.
ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం...
ఆన్‌లైన్ ద్వారా ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. tsbie.cgg.gov.in నుంచి పరీక్షకు అరగంట ముందుగా ఎగ్జామినర్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది. పరీక్ష పూర్తి కాగానే మూల్యాంకనం చేసి మార్కులను వెంటనే అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది.