అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌: ఎంపీ వినోద్‌ | Mp Vinod Kumar started cc cameras in Karimnagar | Sakshi
Sakshi News home page

అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌: ఎంపీ వినోద్‌

Published Sun, Mar 26 2017 1:50 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌: ఎంపీ వినోద్‌ - Sakshi

అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌: ఎంపీ వినోద్‌

కరీంనగర్‌: అతిపెద్ద పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌ మారనుందని ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని వైద్యుల వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరాభివృద్దికి ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. స్మార్ట్ సిటీకి ఎంపికైన కరీంనగర్‌ను వెయ్యి కోట్ల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్, సీపీ కమలాసన్ రెడ్డిలు పాల్గొన్నారు.  
 
ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని జనసందడిగల ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని సీపీ తెలిపారు. విద్యాసంస్థలు, హస్పిటల్, పంక్షన్ హాల్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు టెంపుల్స్ ఏరియాలో ప్రజల బాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement