న్యూఢిల్లీ: మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీలను ఇక నుంచి రైలు చివరలో కాకుండా మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ బోగీలను ప్రయాణికులు తేలికగా గుర్తించేందుకు ప్రత్యేకమైన రంగును వేయనున్నట్లు తెలిపింది.
రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై రైల్వే బోర్డు చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అన్ని రైల్వే జోన్లను కోరింది. మహిళా బోగీల్లోకి పురుషులు ప్రవేశించకుండా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా బోగీల కిటికీలకు మెష్‌లు, బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment