కిందపడుతున్న మహిళను పట్టుకుంటున్న పోలీసు
బీజింగ్ : భర్తతో గొడవ పడి బిల్డింగ్ అంచున నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు కిందకి పడిపోవడం గమనించిన ఓ పోలీసు అధికారం సాహసం చేశారు. ఒట్టి చేతులతో బిల్డింగ్‌పై నుంచి కిందికి పడుతున్న ఆమెను క్యాచ్ పట్టుకున్నారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.
వేగంగా కిందికి పడుతున్న మహిళను పట్టుకోవడంతో సదరు పోలీసు అధికారి వెన్నెముకకు గాయమైంది. దీంతో సహచరులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఇందుకు సంబంధించిన సీపీ ఫుటేజి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment