చైనా తొలి మహిళా జెట్ పైలెట్ దుర్మరణం
బీజింగ్: చైనా తొలి మహిళా పైలెట్ మృత్యవాత పడింది. శిక్షణలో ఉన్న ఆమె ప్రమాదవశాత్తు చనిపోయింది. ఈ మేరకు చైనా మీడియా ఆదివారం తెలిపింది. సిచువాన్ లోని చెంగ్దూ అనే ప్రాంతానికి యూ క్సూ(30) అనే మహిళా పెలెట్ జే-10 ఫైటర్ జెట్ నడిపేందుకు శిక్షణ తీసుకుంటుంది. ఇందుకోసం ఈ ఏడాది ఆగస్టు 1 పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో సభ్యత్వం పొందింది.
స్థానికంగా తయారైన ఫైటర్ జెట్లను నడపగలిగిన మహిళా పెలెట్లలో యూ క్సూ ఒకరని చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకటించింది. శనివారం శిక్షణలో భాగంగా ఆమె వెళ్లిన ఫైటర్ జెట్ అనూహ్యంగా హెబీ ప్రావిన్స్ లో కుప్ప కూలిందని, ఆ సమయంలో ఆమెతోపాటు మరో పెలెట్ కూడా ఉన్నాడని, అయితే అతడు ప్రాణాలతో బయటపడినట్లు మీడియా వెల్లడించింది. మొత్తం 16 మంది పైలెట్లతో మహిళ విభాగం మొదలైందని, వారిలో యూ క్సూ ఒకరని స్థానిక వైమానిక దళ అధికారులు చెప్పారు.