
పఠాన్‌ను అభినందిస్తున్న సహచర ఆటగాళ్లు
సాక్షి, హైదరాబాద్ : తమకున్న బౌలింగ్ బలంతోనే తక్కువ స్కోర్లను కాపాడుకుంటూ ఐపీఎల్-11 సీజన్ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సోమవారం ఉప్పల్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు యూసఫ్ పఠాన్ పట్టిన ఓ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ క్యాచ్ ఎవరిదో కాదు.. అప్పటికే జోరుమీద ఉన్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిది. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో కోహ్లి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి అనూహ్యంగా థర్డ్‌మ్యాన్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యూసఫ్ పఠాన్ వైపు దూసుకొచ్చింది. అంతే వేగంతో పఠాన్ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్‌తో మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. కోహ్లి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ అయింది ఆ వెంటనే డివిలియర్స్, మొయిన్ అలీల వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ చివరకి ఓటమి చవిచూసింది.
అన్న క్యాచ్‌పై తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‘‘ క్యాచ్ పట్టినవా.. చెట్టు మీదున్న మామిడి పండు తెంపినవా’’ అంటూ ట్విటర్‌లో చమత్కరించాడు. ఈ ట్వీట్‌కు ‘అది పఠాన్ చేయి.. అందులో నుంచి జారిపోవడం చాలా కష్టం’ అని సన్‌రైజర్స్ సంచలనం రషీద్ ఖాన్ బదులిచ్చాడు.
Ye Pathan k hath hai bohat mushkil se catch chot jata hai 🖐🏻🖐🏻
— Rashid Khan (@rashidkhan_19) 8 May 2018
Comments
Please login to add a commentAdd a comment