
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతంది.
Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc
— CricTracker (@Cricketracker) July 28, 2024
వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో ఆండీ మెక్‌బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్‌బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.
కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్‌బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించాడు. టెస్ట్‌ల్లో ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 250, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.